
*ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 22 (మన ప్రజావాణి)*:
చండూరు మండలం గుండ్రపల్లి గ్రామ నివాసి నిరుపేద కుటుంబానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త కురుపాటి నాగేష్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకులు చండూరు మండల అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, చండూరు మండల పార్టీ యువజన అధ్యక్షులు ఉజ్జిని అనిల్ రావు, గ్రామ శాఖ అధ్యక్షురాలు పెండ్యాల గీత, రాష్ట్ర నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు, అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్ ఉపాధ్యక్షులు కురుపాటి సుదర్శన్ ఆ కుటుంబాన్ని పరమార్శించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. తదనంతరం బిఆర్ఎస్ చండూరు మండల పార్టీ యువజన అధ్యక్షులు ఉజ్జిని అనిల్ రావు 20,000 వేల రూపాయలు, రాష్ట్ర నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు 15000 వేలు, బిఆర్ఎస్ కార్యకర్తల అమౌంట్ కలిపి 50 వేల రూపాయలు ఆ యొక్క కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గుండ్రపల్లి గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు కురుపాటి లింగస్వామి, తీగల వెంకన్న, పెండ్యాల ఉపేందర్, తరి సురేష్, లింగయ్య, వెంకన్న, జంగయ్య, అనిల్, శివ, రాజు, జగన్ తదితరులు పాల్గొన్నారు.









