స్టాక్స్ ఐపీఓ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజలను మోసం చేసిన నిందితుడి అరెస్ట్

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

స్టాక్స్ ఐపీఓ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజలను మోసం చేసిన నిందితుడి అరెస్ట్

కొమ్మురం బీం ఆసిఫాబాద్ జిల్లా
సిర్పూర్ నియోజకవర్గం
కాగజ్ నగర్ పట్టణం
తేదీ :05-07-2025 తేదీన కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దారుడు తెలిపిన ప్రకారం స్టాక్స్ ఐపీఓ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఒక వ్యక్తి వాట్సాప్ గ్రూప్ సృష్టించి, అందులో 108 మందిని చేర్చి పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేసినట్టు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కాగజ్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇందులో బాధితుడు 26 ట్రాన్సాక్షన్స్ ద్వారా 76,50,000 డబ్బును స్టాక్స్ పేరుతో ఇన్వెస్ట్ చేశాడు
జిల్లా ఎస్పీ శ్రీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, కాగజ్‌నగర్ టౌన్ సీఐ పోలీస్ సిబ్బంది డి ఫోర్ సి బృందం సమన్వయంతో సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు.
విచారణలో నిందితుడు ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేసి, పెద్ద మొత్తంలో డబ్బులు రాబట్టినట్టు తేలింది. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
నిందితుడి వివరాలు
1) అశోక్ కుమార్
క్రియేట్ చేసినటువంటి గ్రూపుల పేర్లు
1) వర్మాస్ బుక్ డిస్కషన్ 2)అలయన్స్ గ్రూప్ లలో 108 మందిని జాయిన్ చేశాడు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.
స్టాక్స్ ఐపిఓ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అడ్మిన్ అయినా నిందితున్ని గుర్తించడానికి కృషిచేసిన డి ఫోర్ సి బృందానికి ,కాగజ్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ ప్రేమ్ కుమార్ , ఎస్సై సుధాకర్ పోలీస్ సిబ్బందికి సైబర్ క్రైమ్ బృందానికి అభినందనలు తెలిపారు.
జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ గ ప్రజలకు ఇచ్చే సూచనలు
సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్లను నమ్మవద్దు.
అపరిచితులు క్రియేట్ చేసినటువంటి ఎటువంటి గ్రూపులలో ఉండకూడదు.
ఆన్లైన్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కేవలం అధికారిక ధృవీకృత ప్లాట్ ఫామ్స్ఉపయోగించాలి.
వ్యాపారస్తులు బ్యాంకు ఖాతా లిమిట్స్ పెంపు వల్ల ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని హెచ్చరించారు సైబర్ మోసాలకు గురైతే వెంటనే1930 నంబర్ కి కాల్ చేయండి లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలి అని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్