
*న్యాయవాది ప్రమీల అభినందన సభ*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 28 (మన ప్రజావాణి)*:
నల్గొండ జిల్లా న్యాయస్థానంలో న్యాయవాదిగా పని చేస్తున్న మామిడి ప్రమీలకు వెల్ ఎడ్యుకేషనల్ అండ్ పీస్ కౌన్సిల్ సంస్థ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసినందుకుగాను మంగళవారం నల్లగొండ బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో అభినందన సభ జరిగింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రమీల న్యాయవాద వృత్తి తో పాటు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆమె సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్ రావడం అభినందించ దగ్గర విషయమన్నారు. న్యాయవాది ప్రమీల మాట్లాడుతూ ఈ గౌరవ డాక్టరేట్ ద్వారా మరింత సీతంగా ప్రజాసేవలో పాల్గొంటారని అందరి సహాయ సహకారాలతో సమాజ సేవ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎం నాగిరెడ్డి న్యాయవాదులు ఎం రామచంద్రరావు, పి శ్యాంసుందర్, మల్లెపల్లి ఆదిరెడ్డి, నూకల సంధ్యారాణి, నిమ్మల బీమా ర్జున్ రెడ్డి, జెనిగల రాములు, ఏ శంకరయ్య, నాంపల్లి భాగ్య, నఫీజ్ ఫాతిమా, మామిడి వెంకటేశ్వర్లు, జి జవహర్లాల్, జి వెంకటేశ్వర్లు, పి శేఖర్, ఎం మోహన్ రెడ్డి, వసంతరావు, గీత, గుంటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025