
*ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన నారాయణ విద్యాసంస్థ*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 28 (మన ప్రజావాణి)*:
హయాత్ నగర నారాయణ పాఠశాలలో ఘనంగా ఇ - చాంపియన్స్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (ఎస్ ఎల్ సి) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జి.యం గోపాల్ రెడ్డి, ఏ. జి. యం రవీంద్ర బాబు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రథమ, ద్వితీయ తరగతులు చదివే విద్యార్థులచే వార్షిక ప్రణాళికలో భాగంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, కంప్యూటర్, జి. కె, సామాన్య శాస్త్రం లో విద్యార్థులు నేర్చుకున్న విషయాలను వారి ద్వారానే వాటి ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు ప్రతిభ పాఠాలను తిలకించిన తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. ఏ.జి. యం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్న తనంలోనే వారు చేస్తున్న అభ్యాసాన్ని వారు గుర్తించి ఆ యొక్క పాఠ్యాంశాల గురించి వివరించడం ఎంతో అభినందనీయంగా ఉందని విద్యార్థుల ప్రతిభను గుర్తించి అభినందించారు. విద్యార్థులు చదువులోనే కాకుండా అన్ని రంగాలలో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లావణ్య, మానస , ఈ- చాంప్స్ కో ఆర్డినేటర్ దివ్య వైస్ ప్రిన్సిపల్ కవిత, తదితర ఉపాధ్యాయునిలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025