
*విద్యార్థి హాకీ గేమ్ లో జాతీయస్థాయి సెలెక్ట్ ప్రిన్సిపాల్ అభినందనలు*
*కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సీఈవో ఎం.వి గోనారెడ్డి ప్రశంసలు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 28 (మన ప్రజావాణి)*:
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎమ్ పి సి మొదటి సంవత్సరo విద్యార్థిని జాతీయ స్థాయిలో హాకీ కి సెలెక్ట్ అయినందుకు కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ సి ఈ వో ఎమ్ వి గోనారెడ్డి అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వందన ను అభినందనలు తెలియజేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ టి సుధారాణి మాట్లాడుతు వందన జాతీయ స్థాయిలో మరెన్నో పతకాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు పద్మ, రవీందర్ స్వామి. గోవర్ధన్ డాక్టర్ కిరణ్ కుమార్ అభినదించారు.









