
*గృహం కూలిపోయిందని ఆర్థిక సహాయం అందజేసిన – లింగోజు కిరణ్ కుమార్*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 29 (మన ప్రజావాణి)*
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, మునుగోడు నియోజకవర్గం, నారాయణపురం మండల కేంద్రంలోని సాగర్ కాలనీలో నేతికార్ శ్రీనివాస్ ఇల్లు బుధవారం పాక్షికంగా కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కె ఆర్ జి ఆర్ ఆర్మీ ఫౌండేషన్ అధ్యక్షుడు లింగోజి కిరణ్ కుమార్ రూ. పది వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. వర్షాల కారణంగా రేకులు, పెంకు లతో ఉన్న నేతి కార్ శ్రీనివాస్ గృహం కూలిపోయిందని తెలిసిన వెంటనే, బాధిత కుటుంబానికి ఫోన్ పే ద్వారా రూ. 10,000/- ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరుపేదలకు అందిస్తున్న సహాయ కార్యక్రమాలను చూసి, ఆయనను ఆదర్శంగా తీసుకొని, ఆయన అడుగుజాడల్లో నడవాలి అనుకొని, కె.ఆర్ జి.ఆర్ ఆర్మీ ఫౌండేషన్ ను స్థాపించి, తనవంతుగా సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో, కష్టాల్లో ఉన్న నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు.









