
రైల్వే స్టేషన్ వద్ద గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న సిసిఎస్ పోలీసులు
పరారీలో మరో వ్యక్తి
గంజాయి విక్రయించిన.. సేవించిన పీడీ యాక్ట్ కోరుట్ల సీఐ సురేష్ బాబు
కోరుట్ల,నవంబర్ 12(ప్రజా వాణి) కోరుట్ల పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో గాంజా అమ్ముతున్నారని వచ్చిన సమాచారంతో,సిసిఎస్ సీఐ ఎం.శ్రీనివాస్,సిసిఎస్ కానిస్టేబుల్ అఫ్రోజ్ ,షాహిద్ లు కోరుట్ల ఎస్సై ఎం చిరంజీవి, ఆధ్వర్యంలో,రైల్వే స్టేషన్లో గంజాయి విక్రయిస్తున్న కోరుట్ల కు చెందిన షేక్ అమన్,ఎండి.ముఖీం అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 210 గ్రాముల గంజాయిని,రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని ఇద్దరు ప్రభుత్వ పంచుల సమక్షంలో కేసు నమోదు చేశారు కాగా మరొక వ్యక్తి పరారీ లో ఉన్నాడు.కోరుట్ల సీఐ బి.సురేష్ బాబు మాట్లాడుతూ గంజాయిని ఎవరు తాగిన,అమ్మిన రవాణా చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.








