
*ఇల్లంతకుంట లో షాడో తహశీల్దార్??*
సారు చూడనిదే ఫైల్ కదలదు
ప్రతి పనికో రేట్...
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఏ పని జరగాలి అన్నకూడా షాడో తహశీల్దార్ గా వ్యవహరిస్తున్న ఓ కింది స్థాయి అధికారి ఆ ఫైల్ చూడనిదే ముందుకు కదలదు. ఏ పని కావాలన్నా మొదటగా షాడో ను కలవాల్సిందేనటా, తహశీల్దారు దగ్గరికి వెళ్ళి పని కావాలన్నా కూడా షాడో ముందుకు ఫైల్ వెళ్లాల్సిందే. ఏండ్లుగా కార్యాలయంలో తిష్టవేసుకొని నేను చెప్పిందే వేదం అన్నట్టు, తోటి ఉద్యోగులపై కూడా హుకుం జారీ చేస్తున్నాడు.
*జీపీఓ లపై పెత్తనం*
నూతనంగా నియామకం అయిన గ్రామ పరిపాలన అధికారులపై సదరు షాడో పెత్తనం చెలాయిస్తున్నాడు. వారు రికార్డులు తనిఖీ చేయాలన్న కూడా ఈ షాడో పర్మిషన్ తీసుకోవాల్సిందేనని, మా దగ్గరికి ఎవరూ వచ్చిన కూడా ఎందుకు వచ్చారు అన్నట్టుగా చూస్తున్నాడని జీపీఓ బాధపడుతున్నట్టు సమాచారం.
*ప్రతి పనికో రేట్*
తహశీల్దారు కార్యాలయానికి ఏ ఫైల్ వచ్చిన కూడా దానికి ఇంత రేట్ అంటూ ఫిక్స్ చేసి ప్రజల జేబులు గుల్ల చేస్తున్నాడు ఆ షాడో తహశీల్దార్. విరాసత్, టిఎం 33, ఆర్డీఓ, కలెక్టర్ కు వెళ్లాల్సిన ఫైళ్ళు ఏమైనా ఉంటే ముందు నా దగ్గరకి వచ్చాక, నేను తనిఖీ చేసిన తర్వాతే ఆ ఫైళ్ళు సదరు కార్యాలయాలకు వెళ్లాలని తోటి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
తహశీల్దార్ కు తెలియదా??
మండల తహశీల్దారు కార్యాలయంలో ఇంత జరుగుతున్న తహశీల్దార్ కు తెలియదా అంటే తహశీల్దార్ ను కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు షాడో తహశీల్దార్. ఆర్డీఓ, కలెక్టరేట్ లో ఎటువంటి హియరింగ్ కేసులు ఉన్న కూడా తహశీల్దార్, షాడో తహశీల్దార్ లు కలిసి వెళ్లాల్సిందే. కింది స్థాయి సిబ్బంది కి కూడా ఏదైనా ఫైళ్ళు తనిఖీ చేసినప్పుడు సందేహాలు ఉంటే కూడా ఆ షాడో ను కలిస్తేనే దానికి పరిష్కారం చూపిస్తాడని సమాచారం.
గిర్దావర్లు చేసే పనులపై కూడా సదరు షాడో తహశీల్దార్ పెత్తనం చేలాయించడంతో, వారు తోటి ఉద్యోగుల వద్ద తమ బాధను వెళ్లగక్కుకుంటున్నారు. ఏది ఏమైనా తహశీల్దార్ అంటే షాడో, షాడో అంటే తహశీల్దార్ అన్నట్టు గా మండలంలో నడుస్తుందని మండల ప్రజలు గుసగుసలు పెడుతున్నారు. ఇకనైనా పై అధికారులు స్పందించి సదరు షాడో, తహశీల్దార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025