
*ప్రజావాణి వినతుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలి*
*హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్*
*హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్*
*ప్రజావాణి కార్యక్రమానికి 139 వినతులు*
హన్మకొండ నవంబర్ 17
ప్రజావాణి :
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశపు హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిలకు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వినతులను అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, మున్సిపల్, తదితర సమస్యలపై ప్రజలు 139 వినతులను కలెక్టర్, అదనపు కలెక్టర్లకు అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు వినతి పత్రాలను అందజేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ను కోరగా అక్కడే ఉన్న సంబంధిత శాఖల అధికారులను వినతుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పలు మండలాలకు సంబంధించిన వినతులపై పరిష్కార చర్యల నిమిత్తం తహసిల్దార్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025