
*మృతుడి కుటుంబానికి 50 కేజీ ల బియ్యం అందించిన ఈ.ఎల్.వి భాస్కర్ ఫౌండేషన్*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, నవంబర్ 19 (మన ప్రజావాణి)*:
నల్గొండ జిల్లా చండూర్ మండలం నెర్మట గ్రామంలోని గాదగొని చంద్రయ్య గ్రామంలోని భజన కళాకారుడు ఎంతో మంది గ్రామంలో మరణించిన వారికి రాత్రి మొత్తం భజన చేసి అలరించే వారు చంద్రయ్య మరణించగా అతనిది చాల నిరుపేద కుటుంబంగా గుర్తించిన గ్రామస్థులు నారపాక ఆంజనేయులు, శంకర్, నారపాక మహేష్, లు ఈ.ఎల్.వి భాస్కర్ ఫౌండేషన్, డైరెక్టర్ అశోక్ కి తెలుపగా స్పందించి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీ ల బియ్యం తక్షణ సహాయంగా కుటుంబ సభ్యులకు అందచేశారు. ఇంక ముందు ఈ.ఎల్.వి ఫౌండేషన్ మీకోసం ఆరోగ్యం, విద్య, ఉద్యోగ ఉపాధి ఫౌండేషన్ లక్ష్యం అని, పేద ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నారపాక శేఖర్, రవితేజ, రాంబాబు, నాగిళ్ళ దశరథ, నాగిళ్ళ లక్ష్మణ్, గాధ గోని వెంకన్న, గాదగొని నర్సింహా, మండల బారతమ్మ, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025