
*రాజన్న సేవలో శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు*
రాయికల్:నవంబర్ 19 (ప్రజావాణి)
రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన 12 మంది శ్రీరాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు గోనె రాములు ఆధ్వర్యంలో బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో స్వయంభువుగా వెలిసి దక్షిణ కాశీగా పేరొందిన ప్రాచీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరాజ రాజేశ్వరస్వామి శైవ క్షేత్రంలో సేవ చేయుటకు బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా గోనె రాములు మాట్లాడుతూ... స్వామివారికి భక్తులు సమర్పించిన డబ్బులను లెక్కించలన్నా సేవలు చేయాలన్న పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. సేవకు వెళ్లిన వారిలో గోనె రాములు,రొండ్ల రమేష్,రొండ్ల లక్ష్మి,ఆమని మేఘన,దొనకంటి తిరుపతమ్మ,నాగెల్లి లక్ష్మి, నాగెల్లి తిరుపతి,రాసమల్ల లక్ష్మి, కొమ్ము సాయమ్మ, మందల శాంత,బద్దం రాజరెడ్డి,కామణి పుష్ప లు ఉన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025