
*చదువు సంస్కారం వల్లే జీవితంలో ఎదుగుతారు*
--రాష్ట్ర ఉద్యోగ ఉపాధి కల్పన ప్రాంతీయ అధికారి బెజ్జారపు రవీందర్
*రాయికల్:నవంబర్ 19(ప్రజావాణి)*
చదువు సంస్కారం కు ప్రాధాన్యత ఇచ్చిన విద్యార్థులు భావి జీవితంలో ప్రత్యేకంగా ఎదిగి అనుకున్నది సాధించ గలుగుతారని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధి కల్పన ప్రాంతీయ అధికారి బెజ్జారపు రవీందర్ అన్నారు.బుధవారం రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు లో పదవతరగతి విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పఠనాసక్తిని పెంపొందించుకొని పాఠ్య పుస్తకాలలోని విషయాన్ని అవగాహన చేసుకొని చదవాలని సూచించారు.చదువెంత వస్తే అంత యోగ్యత ఉంటుందని విషయపరిజ్ఞానం కలవారు ఉన్నత స్థాయి విజయాలు పొందుతారని అన్నారు.మన ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని శ్రమించే తత్వం ఉన్నవారికి నిరుద్యోగ సమస్యలు ఉండవని తెలిపారు విద్యార్థులు ఒక లక్ష్యం సాధించాలనే తపన పట్టుదల తో కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్, మండల విద్యాధికారి యస్.రాఘవులు, ప్రధానోపాధ్యాయులు గట్టు రమేష్ నర్సయ్య ఉపాధ్యాయులు చెరుకు మహేశ్వర శర్మ,పి.రాజశేఖర్, పి.రమేశ్,ఎ.పద్మ,ఎ రజిత,యస్.శోభ,
రాజమహ్మద్ హాస్టల్ వార్డెన్ భన్సినాయక్ తదితరులు పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025