
గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..?
దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు.....?
గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు....??
గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన..
దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి...
మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ...?
అంగడికి గొంగడి ఎక్కడిది....?
హన్మకొండ జిల్లా రిపోర్టర్,నవంబర్ 25(మన ప్రజావాణి): గ్రామపంచాయతీ ఆధీనంలో ఉన్నటువంటి దాదాపు మూడు కోట్ల విలువ చేసే స్థలాన్ని మాయం చేసిన మంత్ర కారులు.1989 నుంచి వస్తున్న గ్రామపంచాయతీ ఆస్తిని 2002 నుంచి అనుభవదారిగా ఏర్పడి 2017 వరకు పూర్తిగా మాయం చేసిన మాంత్రికులు. కానీ 1991 నుండి అప్పటి పాలకవర్గంగానీ, పంచాయతీ కార్యదర్శలు గాని,సర్పంచులు గాని, స్పెషల్ ఆఫీసర్స్ కానీ ఇప్పటివరకు ఆ ఆస్తులపై ఊసే ఎత్తకపోవడం గమనార్హం. అంతేకాకుండా అక్టోబర్ 14వ తేదీన వచ్చినటువంటి గ్రామపంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ అనే కథనంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పడిన నాన్ లేఅవుట్ వెంచర్లలో దాదాపు 200 గజాల చొప్పున రెండేసి ఫ్లాట్లను గ్రామపంచాయతీ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు ఉండడం గ్రామపంచాయతీకి కలిసి వచ్చే అంశం. అంతేకాకుండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మరో నాలుగు నాన్ లేఅవుట్ వెంచర్లలో గ్రామ పంచాయతీకి రావలసిన ఆస్తులపై,గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న అంగడి భూములపై ఆచూకీ కోసం ప్రజావాణి పత్రిక నిఘా చేయగా ప్రస్తుతం ఉన్న భూముల ధరల ప్రకారం దాదాపు 3 నుండి 5 కోట్ల విలువగల భూమిని మాయం చేసినట్టు అంచనా.ఇట్టి భూమికి గాను అసలు గ్రామ పంచాయతీ భూమి మొదలు ఎంత..?రికార్డులో ఉండాల్సిన భూమి ఎంత..?ఉన్నది ఎంత..?ఉండాల్సింది ఎంత..?పూర్తి వివరాలతో మరో సంచికలో...
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025