
*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి*
••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం.
•••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది.
•••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి.
••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం డిసిసి నూతన జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతన అధ్యక్షుని చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లాకు వచ్చిన మంత్రికి కాంగ్రెస్ నేతలు గజమాలతో ఘనస్వాగతం పలికారు.అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటలని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరాలని స్పష్టం చేశారు. సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన బిల్లులను చెల్లించామని, అంతేకాకుండా నేత కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ మానసికంగా మాత్రమే బలహీన పడ్డదని, అన్ని జిల్లాల్లో కంటే సిరిసిల్లలోనే పార్టీ బలంగా ఉందన్నారు. నూతన అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పై ఇప్పుడు ప్రధాన బాధ్యత ఉందని, అందరినీ కలుపుకొనిపోయి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025