
ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ పై లోకాయుక్త కమిషన్ కు బాధితుల ఫిర్యాదు...?
*సంచలనం కలిగించిన మన ప్రజావాణి వార్తా కథనాలు...!
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ ఏడాది సెప్టెంబర్ 11న చింతకాని మండలం పందిళ్ళపల్లి ఓ ప్లాట్ వ్యవహారంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారం డాక్యుమెంట్లు పొందుపరచి గ్రామపంచాయతీ రికార్డులను పరిగణలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై మన ప్రజావాణి తెలుగు దినపత్రిక తో పాటు పలు పత్రికలు భారీ ఎత్తున వార్తా కథనాలు అందించిన సంగతి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగానికి తెలిసిందే. చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన బాధితుడు 2004 సంవత్సరంలో ఓ సామాజిక వర్గానికి చెందిన కుటుంబ సభ్యుల నుండి ఖాళీ స్థలంను కొనుగోలు చేసి కొందరికి ప్లాట్లుగా చేసి అమ్మకాలు చేసిన నేపథ్యంలో భూమి హక్కుదారులకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా 2016 2017 సంవత్సరంలో సంబంధిత గ్రామపంచాయతీ రికార్డులలో ఆన్లైన్లో నమోదు చేసి తాజాగా సెప్టెంబర్ ఒకటో తారీఖున ధ్రువీకరణ పత్రాలు అందించి ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించి ఆ తర్వాత సెప్టెంబర్ 18న తనఖా రిజిస్ట్రేషన్ చేసి ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ నుండి సుమారు మూడున్నర లక్షలు ఉన్నం పొందినట్లు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్న వేళ ఆధారాలతో బాధిత కుటుంబం ఖమ్మం ప్రజావాణి గ్రీవెన్స్ లో సంబంధిత జిల్లా కలెక్టర్ డీపీఓ ల కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు విచారణకు రంగం సిద్ధం చేసినట్లు ఇదే వ్యవహారంపై లోకాయుక్త కమిషన్ రిజిస్ట్రీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతుంది. దీనితోపాటు ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ మరియు పంచాయతీ అధికారుల పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం లోకాయుక్త తెలంగాణ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితుల దస్త్రం కమిషన్ కు చేరినట్లుగా సమాచారం అందింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేసి బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు సిఫార్సు చేయాలని, బాధిత కుటుంబాని కి న్యాయం చేసి ఆదుకోవాలని పలువురు స్థానికులు పలువురు ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025