*కోరుట్ల కోర్టు జడ్జి నారం అరుణ్ కుమార్ ఏపీపీ ప్రణయ్ కు ఘన సన్మానం

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*కోరుట్ల కోర్టు జడ్జి నారం అరుణ్ కుమార్ ఏపీపీ ప్రణయ్ కు ఘన సన్మానం*

కోరుట్ల,జులై 30(ప్రజావాణి)
కొరుట్ల బార్ అసోసియేషన్ చరిత్రలో మరొక అద్భుత ఘట్టం నమోదైంది. తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం ఎన్నికలు ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించబడగా,కోరుట్ల కోర్టు ఇంచార్జి జడ్జి నారం అరుణ్ కుమార్ విశేష మెజారిటీతో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా గెలుపొందడం గొప్ప గర్వకారణం.అదే సందర్భంలో,తెలంగాణ రాష్ట్ర అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ల సంఘం ఎన్నికల్లో,కోరుట్ల కోర్టు ఇంచార్జి ఏపీపీ ప్రణయ్ జాయింట్ సెక్రటరీగా గెలుపొందారు.వారి ఇరువురి విజయాలు కోరుట్ల న్యాయవాద కుటుంబానికి మరొక గౌరవాన్నిచ్చాయి అని కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్ అన్నారు.ఈ సందర్బంగా కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇరువురు అధికారులను ఘనంగా సన్మానించడమైంది.ఈ సందర్భంగా న్యాయమూర్తి నారం అరుణ్ కుమార్ మాట్లాడుతూ “న్యాయవ్యవస్థ పట్ల నాలో ఉన్న నిబద్ధతను గుర్తించి అప్పజెప్పిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటుగా, న్యాయసేవల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను,అని అన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి కొంపల్లి సురేష్, ఖజానాదారు ప్రేమ్,స్పోర్ట్స్ సెక్రటరీ సుతారి నవీన్ కుమార్,సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కడకుంట్ల సదాశివరాజు,గోనే సదానంద్ నేత,జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఊరడి నరేందర్,లైబ్రరీ సెక్రటరీ మరిపల్లి గంగాధర్ సీనియర్ న్యాయవాదులు ముబీన్ పాషా,బోయిని సత్యనారాయణ,తోకల రమేష్ ,జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్