
వ్యవసాయ పరికరాలపై రైతులు రాయితీ పొందండి.
••• చందుర్తి వ్యవసాయ అధికారి కే. అనుష.
చందుర్తి //ప్రజావాణి
వ్యవసాయ పరికరాలపై రాయితి పొందడానికీ రైతులు దరఖాస్తు చేసుకోవాలని చందుర్తి మండల వ్యవసాయాధికారి కే. అనుష సోమవారం రోజున ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…..2025-26 సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులు, 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న, సూక్ష్మ రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం చొప్పున సబ్సిడీ మీద పరికరాలు అందిస్తామని పేర్కొన్నారు.
*పని ముట్ల వివరాలు*…
బాటరీ స్ప్రేయర్, పవర్ స్ప్రేయర్, రోటవేటర్, కల్టివేటర్, బ్రష్ కట్టర్ మరియు సీడ్కం ఫర్టిలైజర్ డ్రిల్ అందుబాటులో ఉంటాయని చెప్పారు.రాయితీ పొందడానికీ అర్హతగల రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. మట్టి నమూనా పరీక్షలు కూడా చేసుకొని ఉండాలి. రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్, పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, అప్లికేషన్ ఫామ్ జతచేసి ఈ నెల 25 వ తేదీలోపు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు సమర్పించగలరు.