
*రేషన్ డీలర్ల ఐదు నెలల కమిషన్ ను త్వరగా విడుదల చేయాలి*
👉 తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత
*తంగళ్ళపల్లి ప్రజావాణి ఆగస్టు 25* రేషన్ డీలర్లకు రావలసిన ఐదు నెలల పెండింగ్ కమిషన్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రేషన్ షాప్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్ అన్నారు . తంగళ్ళపల్లి తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ జయంతి కుమార్ కు డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందించారు. అనంతరం పొన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏప్రిల్,ఆగస్టు నెలల నుండి కమిషన్ రానందుల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఆగస్టు మూడు నెలల బియ్యం ప్రజలకు ప్రభుత్వ ఆదేశానుసారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అత్యంత పారదర్శకంగా పంపిణీ చేశామని అన్నారు. పాత పద్ధతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల కమిషన్ ఒకేసారి విడుదల చేసి డీలర్ల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. వీరి వెంట రేషన్ డీలర్లు తదితరులు ఉన్నారు