*మున్సిపల్ క్వార్టర్స్ నోటీస్ లు వెనక్కి తీసుకోవాలి *నివాసం వున్న వారికే మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి – వై విక్రమ్* *సానుకూలంగా స్పందించిన కమిషనర్…*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*మున్సిపల్ క్వార్టర్స్ నోటీస్ లు వెనక్కి తీసుకోవాలి

*నివాసం వున్న వారికే మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి – వై విక్రమ్*

*సానుకూలంగా స్పందించిన కమిషనర్…*

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

నగరం నడిబొడ్డున 43 వ డివిజన్ పరిధిలోని రేవతి సెంటర్ మున్సిపల్ క్వార్టర్స్ కు ఇచ్చిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి ‌అని , గత 40 సంవత్సరాలుగా వాటిని నమ్ముకుని అక్కడే నివాసం వున్న వారికి మార్కెట్ రేట్ ప్రకారం స్థానికులకే ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపి మేయర్, మరియు కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ మాట్లాడుతూ గతంలో సిపిఎం పార్టీ నేత చిర్రవూరి లక్ష్మినర్సయ్య పరిపాలన
పాలనా కాలంలో ఆనాడు ఖమ్మం టౌన్ లో మామిళ్ళగూడెం, బోనకల్లు రోడ్, త్రీ టౌన్ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి నివాసం వద్ద ఇలా పలు చోట్ల మున్సిపల్ అధికారులు, ఉద్యోగస్తులు, పారుశుద్దం పని చేసే వారికి క్వార్టర్ లు కట్టించారు అని తెలిపారు. అందులో భాగంగా రేవతి సెంటర్ లో 140 క్వార్టర్స్ పారుశుద్దం కార్మికుల కోసం కట్టించారు అని తెలిపారు. కాలక్రమంలో చాలా చోట్ల అక్కడే నివాసం వున్న ఉద్యోగస్తులకు స్థలం మార్కెట్ రేట్ ప్రకారం ఇచ్చారు అని తెలిపారు. ఇప్పుడు అకస్మాత్తుగా రేవతి సెంటర్ మున్సిపల్ క్వార్టర్స్ కు నోటీసు లు ఇవ్వడంతో రిటైర్మెంట్ ఉద్యోగస్తులు, ప్రస్తుత ఉద్యోగులు ఆందోళన కు గురయ్యారు అని పేర్కొన్నారు. 40 సంవత్సరాలుగా అక్కడే నివాసం వుండి క్వార్టర్స్ మరమత్తులు కోసం ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకపోతే వాటినే రిపేర్ చేసుకుని జీవనం సాగిస్తున్నారు అని తెలిపారు. స్థానికులకే క్వార్టర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2007 వ సంవత్సరంలో ఆనాడు సిపిఎం పార్టీ పరిపాలనా కాలంలో కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ సమీనా ఆఫ్రోజ్ చొ రవతో పాలకవర్గంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు అని గుర్తు చేశారు కార్పొరేషన్ అధికారులు, మేయర్, పాలక పార్టీ నేతలు ఈ సమస్య పట్ల సానుకూలంగా స్పందించాలి అని కోరారు. ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలి ‌అని డిమాండ్ చేశారు. మార్కెట్ రేట్ ప్రకారం వాటిని నమ్ముకుని నివాసం వున్న వారికి ప్రభుత్వం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి క్వార్టర్స్ బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ
కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బుర్రి శోభారాణి, నాయకులు సిహెచ్ భద్రం, ఉపేంద్ర, రెడపంగి శ్రీను, నరసింహారావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share