
ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం పండుగ జరుపుకోవాలి
పీస్ కమిటీ మీటింగ్ లో కోరుట్ల సిఐ బి సురేష్ బాబు
కోరుట్ల,ఆగస్టు 31(ప్రజావాణి)
ప్రశాంత వాతావరణంలో వినాయక నిమర్జనం పండగను జరుపుకోవాలని కోరుట్ల సీఐ సురేష్ బాబు అన్నారు.ఆదివారం రోజు కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ ఆరో తరగతి జరగబోయే గణేష్ నిమజ్జనం పండుగ సందర్భంగా అన్ని మతాల పెద్దలు కుల సంఘాల పెద్ద మనుషులతో పీస్ కమిటీ మీటింగ్ కోరుట్ల సిఐ బి సురేష్ బాబు,ఎస్ఐ ఎం.చిరంజీవి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ సురేష్ బాబు మాట్లాడుతూ నిమజ్జనం రోజు కోరుట్ల టౌన్ రూరల్ ఏరియాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ ప్రశాంతంగా నిమజ్జనం పండుగ నిర్వహించుకోవాలని, ఇతర మతాలని ఎవరు కించపరచకుండా మరియు మీ దృష్టికి వచ్చిన లేదా సోషల్ మీడియా ద్వార ప్రచారం అయ్యే రూమర్స్ ని నమ్మకుండా సంబంధిత పోలీసు వారికి తెలియజేస్తూ, అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు
ఈ మీటింగ్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని మతాల పెద్దలు హాజరయ్యారు