
మహిళలపై ఆగని అకృత్యాలు..!
ఖమ్మం మూడవ టౌన్ పరిధిలో వివాహితకు సింగరేణి ఔట్సోర్సింగ్ ఉద్యోగి వేధింపులు..?
అనుమానాస్పద స్థితిలో మృతి మూడవ టౌన్ లో అందిన ఫిర్యాదు..
సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలి
మూడు నెలలుగా నీలి చిత్రాలు ప్రైవేటు వీడియోలు ఉన్నాయంటూ.. వేధింపులు..?
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం పట్టణంలోని మూడవ టౌన్ లో ఓ సింగరేణి అవుట్సోర్సింగ్ ఉద్యోగి బెజ్జం రామకృష్ణ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ నీలి చిత్రాలు ప్రైవేటు వీడియోలు ఉన్నాయంటూ గత మూడు నెలల నుండి వెంటబడి వేధించడంతో అనుమానదస్పద స్థితిలో మృతి చెందడం ఖమ్మం పట్టణంలో కలకలం సృష్టిస్తోంది. కాగా మృతులాలి తల్లి వైద్య ఆరోగ్యశాఖలో ఏఎన్ఎం గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సదరు ఏఎన్ఎం మూడవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ చేయాలని జిల్లా పోలీస్ అధికారులను వేడుకుంటున్నారు. కాగా గత మూడు నెలలుగా ప్రవేట్ వీడియోలు నీలి చిత్రాలు ఉన్నాయంటూ వేధింపులకు పాల్పడుతున్నట్లు తల్లిదండ్రులు అంటున్నారు.