
స్టేట్ బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని
అప్పల నరసింహా పురం రెవిన్యూ పరిధిలో గుట్టల్లో ఫ్యాక్టరీల కాలుష్యం వలన చావు తప్ప మరో మార్గం లేదంటూ గొల్లుమన్న రైతులు.. ఆనాటి ప్రజావాణి కథనాలకు స్పందనగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కానీ నేటికీ రైతుల బాధితుల ఫిర్యాదులను చేసిన ఎంక్వయిరీలు పరపతి పలుకుబడి రాజకీయ అండదండలతో బుట్ట దాఖలు చేశారు.. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు బాధితులు కోరుతున్న నేపథ్యం. వందలాదిగా మిమ్మల్ని గుట్టల్లో దాక్కొని.. దిన దిన గండం బతుకుతున్నట్లు పరిసర గ్రామాల రైతులు కూలీలు బాధితులు అంటున్నారు. సుమారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలో ఫారెస్ట్ భూమి 200 ఎకరాలు ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది.. ఆంధ్ర సరిహద్దులో అప్పల నరసింహపురం గుట్టల్లో రైతుల ఆకాంక్షలకు విరుద్ధంగా.. ప్రజల ఆరోగ్యం గుల్ల అవుతున్న సంబంధిత శాఖ అధికారులు చలనం లేకపోవడం అత్యంత దుర్మార్గమని రైతు సంఘాలు ప్రజా సంఘాలు హక్కుల సంఘాలు నిలదీస్తున్న నేపథ్యం.
రాస్తే ఏమవుతుంది..? అండదండలు పరపతి పలుకుబడి వ్యవస్థలను మేనేజ్ చేసాం అనే విధంగా వ్యవహారం నడుస్తోందని రైతులు బాధితులు కన్నీరు పర్యంతం అవుతున్న నేపథ్యం. పంటలు ఉన్న సమయంలో విచారణకు రాని అధికారులు పంటలు పూర్తయిన తర్వాత విచారణకు రావడం పట్ల ఆనాడే విమర్శలు వెల్లువెత్తాయి.. పలుమార్లు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా లు గోషించినప్పటికీ నేటికీ రైతులకు భరోసా కల్పించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. జల.వాయు భూమి కాలుష్యం అవుతూ వన్య ప్రాణులకు ప్రమాద భరితంగా మారిన పట్టించుకోని నేపథ్యంపై అసలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నమ్ముకున్న వ్యవసాయాన్ని ఉన్న కొద్దిపాటి భూములను సాగు చేసుకుంటూ కాలం వెళ్ల దీస్తున్న దుస్థితి పై మన ప్రజావాణి ప్రత్యేక కథనాలు నిరంతరాయంగా అందించడం జరుగుతోందని విజ్ఞప్తి చేస్తున్నాం.









