
ఖమ్మం బ్యూరో ప్రతినిధి, మన ప్రజావాణి
మట్టిలో తేమ.. నమ్మితే.. అనే పాటతో సినీ రంగంలో ఒక హైప్ క్రియేట్ చేసుకున్న పాట ఆ మండలంలో రబి ఖరీఫ్ సీజన్లో రైతులు మరియు కౌలు రైతుల ధాన్యమును ఆ శాఖ పరిధిలో మిల్లర్లు కొనుగోలు చేస్తున్న సందర్భంలో కోడుభాషగా ఉపయోగించి లక్షలాది రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు.. తాజాగా టాస్క్ ఫోర్స్ దాడిలో భారీ ఎత్తున పిడిఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు అధికారులు అవి రేషన్ బియ్యం మా లేక ఇతర బియ్యం అంటూ తర్జనభజన పడుతూ పరీక్షలు చేస్తున్నారు . సందట్లో స్టడీ మియా అన్నట్లుగా రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మీదకు తెలుస్తోంది.
ఆనాడు ఖరీఫ్ సీజన్లో రైతులు విల్లు సామర్థ్యం కంటే ఎక్కువ ధాన్యం తీసుకొస్తున్నారు.. మమ్మల్ని ఏం చేయమంటారు .. మా రేటు ఇంతే.. అంటూ కొర్రీలు పెట్టారు వ్యవహారం తెలిసిందే మన ప్రజావాణిలో అనేక వార్తా కథనాలు వచ్చిన సంగతి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అధికారులకు విధితమే.. కానీ ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా సన్నబియాన్ని కొనుగోలు చేసి వ్యాపారం కోసమా.. సన్న బియ్యం కొనుగోలు చేయమని చెప్పిన వ్యాపారులు ఎవరు ఉన్న పాత్రధారులు ఎవరు. ? అంత భారీ మొత్తంలో ఆ మిల్లులో పేదల బియ్యం నిల్వ చేశారు.. సీఎంఆర్ రైస్ ఉన్న మిల్లులు అదే తీరు.. లేని మిల్లులు ఇంకా అంతకంటే ఎక్కువనా..?
లోకల్ నిఘాసంస్థలు.. రెవెన్యూ సివిల్ సప్లై అధికారుల కనుసైగల్లో ఉనికిపాట్లు పడుతున్నారా..?
మెరుపు దాడి సంచలనం కలిగించిందా..?
బి త్తర పోయిన ఆ శాఖ అధికారులు..? ఇంతకీ ఆ బిల్లుకు రేషన్ బియ్యం సప్లై చేసిన డీలర్లపై వ్యాపారులపై బిల్లు యజమానులపై చర్యలు ఉంటాయా?.?
సూర్యాపేట జిల్లాలో రేషన్ దందాపై ఉక్కు పాదం మోపిన విధంగా వ్యవహరించాలని కోరుతున్న ప్రజా సంఘాలు..?
అయినప్పటికీ ఇప్పటికైనా మిల్లర్లపై రేషన్ డీలర్ల పై చర్యలు ఉంటాయా అంటూ పలు అనుమానాలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.









