గత రెండు నెలలుగా నల్లగొండ జిల్లా & సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో రైతులు కొన్ని సంవత్సరాలుగా పెంచుకున్న శ్రీగంధం చెట్లను నరికి షాగ ను అమ్ముకుంటున్న అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్ – కె.శివరాం రెడ్డి, డి‌.ఎస్‌.పి, నల్లగొండ*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*గత రెండు నెలలుగా నల్లగొండ జిల్లా & సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో రైతులు కొన్ని సంవత్సరాలుగా పెంచుకున్న శ్రీగంధం చెట్లను నరికి షాగ ను అమ్ముకుంటున్న అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్ – కె.శివరాం రెడ్డి, డి‌.ఎస్‌.పి, నల్లగొండ*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 15 (మన ప్రజావాణి)*:

నల్లగొండ జిల్లాలో గత రెండు నెలలుగా రైతులు కొన్ని సంవత్సరాల కాలం పాటు పెంచుకున్న శ్రీగంధం చెట్లను అక్రమంగా నరికి దొంగతనాలకు పాల్పడుతున్నారని సమాచారం మేరకు తేది : 30.09.2025 రోజున అర్ద రాత్రి సమయములో కనగల్ మండల పరిధి లోని నేషనల్ హైవే 595 రోడ్ కి సమీపములోని ఒక శ్రీ గంధం చెట్లు ఉన్న చిలుక విద్యాసాగర్ తోట లోకి వెళ్ళి చెట్లు కోసే రంపం మిషన్ లు, గొడ్డల్లు, ఉపయోగించి తోటలో 10 శ్రీగంధం చెట్ల మొద్దులు దొంగిలించుకొని, ఇంకా 5 శ్రీగంధం చెట్ల నరికి వదిలివేసినారు అని చిలుక విద్యాసాగర్ రెడ్డి పిర్యాదుపై కేసు నమోదు చేయనైనది. ఈ కేసు పరిశోదనలో బాగంగా, జిల్లా ఎస్.పి. శ్రీ. శరత్ చంద్ర పవర్, ఐ‌పి‌ఎస్, ఆదేశాల ప్రకారం, నల్లగొండ డి‌.ఎస్‌.పి కె.శివరాం రెడ్డి ఆధ్వర్యములో నాలుగు బృంధాలుగా ఏర్పడి తనిఖీలు చేయుచుండగా, ఈ రోజు తేదీ 15.10.2025 ఉదయం 06.00 గం,,ల సమయంలో కనగల్ పోలీసులు నల్గొండ – దేవరకొండ రహదారిపై రంగారెడ్డి బంగ్లా వద్ద వాహానాలు తనిఖీలు నిర్వహిస్తుండగా దేవరకొండ వైపు నుండి నల్గొండ వైపు కి రెండు బైక్ AP-31-BS-1571, AP-28-DQ2491 లపై వెళ్ళు చున్న ముగ్గురు అనుమానస్పధముగా వెనుకకు తన బైక్ లను తిప్పుకొని వెళ్ళు చుండగా వారిని కనగల్ పోలీస్ వారు పట్టుబడి చేసి వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న 3 రంపాలు, 3 గొడ్డల్లు, ఫెన్సింగ్ వైర్ కట్ చేసే ఒక కట్టర్, ఒక ఆక్సల్ బ్లేడ్, మూడు మొబైల్ ఫోన్ లు రెండు బైక్ ల పై వెళ్తున్నా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా !

*నిందితులవివరాలు*

ఏ-1: అన్నాభౌ లక్ష్మణ్ గైక్వాడ్ , నివాసం: మహారాష్ట్ర స్టేట్ (పరారీలో)
ఏ-2: దివానా తండ్రి కుక్కనీయ, వయస్సు: 21 సంవత్సరములు, కులము:పార్ది ఆదివాసీ, ఆర్/ఓ గంధిగ్రామ్ గ్రామం, జానక్పుర్ తాలూకా, కాట్నీ జిల్లా, మద్యప్రదేశ్.
ఏ-3: దద్ద సింగ్ తండ్రి రామ్ సింగ్, వయస్సు: 20 సంవత్సరములు, కులము:పార్ది ఆదివాసీ,, ఆర్/ఓ అరుద్వా గ్రామం & తాలూకా, కాట్నీ జిల్లా, మద్యప్రదేశ్.
ఏ-4 మజాన్ తండ్రి అన్మెష్ సింగ్, వయస్సు: 20 సంవత్సరములు, కులము:పార్ది ఆదివాసీ, ఆర్/ఓ సుగువా గ్రామం, లాలక్పూర్ తాలూకా, కాట్నీ జిల్లా, మద్యప్రదేశ్.
ఏ-5: జవాస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం (పరారీలో)
ఏ-6: అజుబా మధ్యప్రదేశ్ రాష్ట్రం (పరారీలో)

*నిందితులు నేరం చేయు విధానం.*

పైన తెల్పిన ఏ-2 నుండి ఏ-6 నేరస్తులు వారందరు మద్య ప్రదేశ్ రాష్ట్రము, అజుబా గవన్ గ్రామం, రిటీ తహసిల్, కట్నీ మరియు పన్నా జిల్లాలకు చెందిన వారు. వీరు దేశము లోని వివిద ప్రాంతలో సంచార జీవనము గడుపుతూ రుద్రాక్షలు & పూసలు అమ్ముకొంటూ జీవనం గడుపుతుంటారు, వీరు ఎక్కడికి వెళ్ళిన గ్రామా శివారు ప్రాంతలో గుడారాలు వేసుకొని నివసిస్తుంటారు, గత రెండు నెలల క్రితం వీరికి మహారాష్ట కు చెందిన ఏ-1 అన్నాభాహు లక్ష్మణ్ గైక్వాడ్ అను వ్యక్తి పరిచయం అయినాడు. వీరు అంత హైద్రాబాద్ లో ఉన్నప్పుడూ ఏ-1 వీరి గుడిసెల వద్దకు వచ్చేవాడు. మీరు ఎన్ని రోజులు రుద్రాక్షలు అమ్మిన మీరు ధనవంతులు కాలేరని, మీరు నేను చెప్పినట్టు చేస్తే మీరు తొందరగా అధిక డబ్బులు సంపాదింవచ్చు అని, తెలంగాణ రాష్ట్రములోని వివిద ప్రాంతలోని రైతులు శ్రీ గంధం చెట్లు సాగు చేస్తుంటారు, అట్టి శ్రీ గంధం కర్రలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ చెట్లను నరికి ఏ-1 కు ఇస్తే, ఏ-1 వాటిని అక్రమ రవాణా చేసి, ఈ కర్రలును అమ్మి మీకు అట్టి డబ్బులో వాటా ఇస్తాను అని వారితో చెప్పగా, అలా దొంగతనముగా రైతుల కష్టపడి కొన్ని సం,, ల నుండి సాగు చేసుకొంటున్న శ్రీ గంధం చెట్లును నరికి వాటి కర్రలను దొంగలించడం నేరము అని తెలిసిన కూడా అధిక డబ్బులు సంపాదించాలానే దూరాశ తో దొంగతనం చేయడానికి ఒప్పుకొని, నల్గొండ జిల్లాలో గత రెండు నెలలో కనగల్ మండలం లోని తెలకంటి గూడెం, తిమ్మన్న గూడెం, నార్కట్ పల్లి మండలం, గుర్రంపోడు మండలం, నల్లగొండ రూరల్, చండూరు మండలం మొత్తం 6 దొంగతనాలు చేసినారు.వీరు 40 కే‌జిల షాగాను అప్పచెప్పాగా, ఒక్కొక్కరికి రూ. 10,000/- చొప్పున 50,000/- ఇవ్వడం జరిగింది నేరం ఒప్పుకోగా నిందితులను నేడు అరెస్టు చేసి రిమాండుకు తరలించడం జరీగింది. వీరు వివిధ ప్రాంతాల్లో రైతులు పెంచిన సుమారు 166 శ్రీగంధం చెట్లు నరికి నష్టపరచగా సుమారు 1 కోటి 66 లక్షల విలువగల ఆర్థిక నష్టం వాటిల్లింది.

*నిందితుల నుండి స్వాదీన పర్చుకున్న వస్తువుల వివరాలు*

1) వీరి వద్ద నుండి 11 శ్రీగంధం మొద్దులు
2) దొంగతనానికి ఉపయోగించే రెండు బైక్ నెం.AP-31-BS-1571 & AP-28-DQ2491
3) 3 రంపాలు, 2 గొడ్డల్లు, ఫెన్సింగ్ వైర్ కట్ చేసే ఒక కట్టర్,
4) 2-మొబైల్ ఫోన్ లు స్వాధీనం.

*నిందితుల పై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు*

క్రైమ్ నెంబర్. 180/2025 యు/ఎస్ 303 (2) బి ఎన్ ఎస్ ఆఫ్ కనగల్ (తిమ్మన్నగూడెం). క్రైమ్ నెంబర్. 181/2025 యు/ఎస్ 303 (2) ఆర్/డబ్ల్యు 62 బి ఎన్ ఎస్ ఆఫ్ కనగల్ పిఎస్. క్రైమ్ నెంబర్. 349/2025 యు/ఎస్ 329 (3), 324 (4), 303 (2) ఆర్/డబ్ల్యు 62 బి ఎన్ ఎస్ ఆఫ్ నార్కట్పల్లి పిఎస్. క్రైమ్ నెంబర్.192/2025, యు/ఎస్ 303 (2) ఆర్/డబ్ల్యు 62 బి ఎన్ ఎస్ ఆఫ్ నల్గొండ రూరల్ పిఎస్.
క్రైమ్ నెంబర్. 176/2025 యు/ఎస్ 303 (2) ఆర్/డబ్ల్యు 62 బి ఎన్ ఎస్ ఆర్ గుర్రంపోడు పిఎస్)
క్రైమ్ నెంబర్.146/2025 యు/ఎస్ 303(2) ఆర్/డబ్ల్యు 62 బి ఎన్ ఎస్ ఆఫ్ చండూర్ పిఎస్. ఈ కేసును నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో త్వరితగతిన చేదించిన సి‌ఐ-చండూర్ కె ఆధిరెడ్డి, ఎస్.ఐ. లు కె రాజీవ్ రెడ్డి, కనగల్, ఎన్. వెంకన్న చండూర్, డి. సైదా బాబు, నల్లగొండ రూరల్, సి ఐ రైటర్ వి. రమేశ్, జానకి రాములు, తిరుమలేష్, శ్రీకాంత్, రాజు, బాలకోటి, శంకర్, శేఖర్, బి. సురేశ్, హెచ్.రమేశ్, టి వెంకట్ రెడ్డి లను జిల్లా ఎస్‌పి శ్రీ శరత్ చంద్ర పవర్ ఐ‌పి‌ఎస్ అబినందించినారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share