
ఛాంపియన్లు గా శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల అరుదైన ఘనత!*
మధిర: మన ప్రజావాణి ప్రతినిధి అక్టోబర్ 18
వరుసగా రెండోసారి మండల స్థాయి స్కూల్ ఆటలపోటీలలో
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహించిన 2025-26 మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలలో మధిర శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ చాటుతూ మరోసారి తమ సత్తాను చాటారు. అన్ని విభాగాలలో ఆధిపత్యం చాటిన శ్రీనిధి స్పోర్ట్స్ టీములు క్రింది విజయాలను సాధించాయి 1. *జూనియర్ గర్ల్స్ కబడ్డీ ప్రథమ స్థానం*
2. సీనియర్ గర్ల్స్ కబడ్డీ ప్రథమ స్థానం
3. జూనియర్ బాయ్స్ కబడ్డీ – ప్రథమ స్థానం*
4. జూనియర్ బాయ్స్ వాలీబాల్ ద్వితీయస్థానం*
5. సీనియర్ బాయ్స్ ఖో-ఖో –ద్వితీయస్థానం*
6. జూనియర్ బాయ్స్ ఖో-ఖో ద్వితీయస్థానం*
సాధించి ప్రతీ విభాగంలో శ్రీనిధి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి ముందంజలో నిలిచి. పాయింట్ల ఆధారంగా *ఓవర్ ఆల్ చాంపియన్ షిప్ ట్రోఫీని మరోసారి సొంతం చేసుకుంది. గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం వరుసగా రెండోసారి ఛాంపియన్స్ గా అవతరించారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఘనమైన అభినందన కార్యక్రమంలో పాఠశాల *సెక్రటరీ & కరస్పాండెంట్ ప్రిన్సిపల్ బి.అంజన బాబు మరియు డైరెక్టర్ చందు మాట్లాడుతూ శ్రీనిధి విద్యార్థులు విద్యతోపాటు క్రీడా రంగంలోనూ అగ్రగాములుగా నిలవడం గర్వకారణం అని . శ్రీనిధి పాఠశాల లో నిరంతర క్రీడలను ప్రోత్సహించడం వలన ఈ విజయం లభించిందని పేర్కొన్నారు. ఈ విజయాలలో నిరాతరం శ్రమించిన క్రీడాకారులను, వారికి శిక్షణ అందించిన *పి.డి. ప్రవీణ్ కుమార్ మరియు శివ పి.ఈ.టి. కరిష్మా* లను కరస్పాండెంట్ అంజన బాబు ,డైరెక్టర్ చందు ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డి. శ్రీను, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని విజేతలను అభినందించారు.









