
నేటి బందుకు సహకరించిన పలు కుల సంఘాలు మరియు అఖిలపక్ష నాయకులు.
మధిర : మన ప్రజావాణి ప్రతినిధి అక్టోబర్ 18.
తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం డిమాండ్ చేస్తూ బీసీ బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అఖిలపక్ష పార్టీలు బీసీ బందుకు మద్దతు తెలిపి బంధు కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా కాంగ్రెస్, టిడిపి,సిపిఎం, సిపిఐ, పార్టీలతోపాటు ఎమ్మార్పీఎస్ ,మాల మహానాడు, కమ్మ ,రెడ్డి, ఆర్యవైశ్యు , మరియు బీసీ కులాలు యాదవ గౌడ రజక నాయి బ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ పద్మశాలి ఒడియ రాజుల సంఘాలు మద్దతు తెలిపి బందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును పెట్టి ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నేటి బందుకు సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు పోలీస్ మిత్రులకు మా బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మున్నూరు కాపు తరపున ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ అధ్యక్షులు ఆళ్ళ కృష్ణ మధిర టౌన్ అధ్యక్షులు నీలం వెంకటేశ్వర్లు మండల సెక్రెటరీ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు టౌన్ సెక్రెటరీ దేవిశెట్టి కృష్ణ లంకెమల్ల నాగేశ్వరరావు చెన్నం స్వామి ధనిశెట్టి సంపత్ ఇల్లూరు ఎడ్ల పూర్ణయ్య నవీన్ తదితరులు పాల్గొన్నారు









