
కార్తీక మాసం సందర్భంగా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు*
మధిర మన ప్రజావాణి అక్టోబర్ 24
కార్తీక మాసం సందర్భంగా భక్తుల కోరిక మేరకు పుణ్యక్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు మధిర డిపో మేనేజర్ డి.శంకర్ రావు తెలిపారు.అన్నవరం, పంచారామాలు, అరుణాచలంకు సంబంధించిన పోస్టర్ను డిపో మేనేజర్ డి శంకర్ రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ పవిత్ర కార్తీకమాసం సందర్భంగా శైవ క్షేత్రాలకు మధిర డిపో నుండి పంచరామాలకు, అన్నవరం అదేవిధంగా అరుణాచలానికి(కార్తీక పౌర్ణమి కి) ప్రత్యేక డీలక్స్ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు ఆయినా తెలిపారు .ఈ కార్తీకమాసంలో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు మధిర నుండి పంచారామాలు అదేవిధంగా అన్నవరానికి డీలక్స్ బస్సు సర్వీసు ఏర్పాటు చేసిన్నట్లు ఆయన తెలిపారు. ఈ సదవకాశాన్ని మధిర మరియు పరిసర ప్రాంతాల ప్రయాణికులు భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
చార్జీ వివరములు:
అన్నవరం*(ఒకవైపు చార్జీ మాత్రమే)
పెద్దలకు : 770/-
పిల్లలకు :430/ –
పంచారామాలు* (రాను పోను కలిపి)
పెద్దలకు: 2,000/-
పిల్లలకు: 1,020/-
మరిన్ని వివరాలకు*
*6301151730*
*9063412754*
*9491357479*
*9908166892*









