
సామినేని రామారావు హత్య కేసును చేధించేందుకు ఐదు ప్రతేక బృందాలు…?
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో (శుక్రవారం) తెల్లవారుజామున సుమారు 5:30 సమయంలో హత్యకు గురైన సిపిఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్య కేసును పోలీస్ శాఖ సీరియస్ తీసుకోవడంతో పాటు ఐదు ప్రతేక బృందలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. *హత్య జరిగినట్లు సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్, వివరాలు సేకరించారని తెలిపారు. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అప్పటి వరకు అందరూ సమన్వయం పాటించాలని అన్నారు. ఊహాజనితమైన కథనాలు, తప్పుడు ప్రచారాలు, ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు. కాగా పలు కోణాలలో విచారణ ముమ్మరం చేశారు గ్రామంలో డేగ కళ్ళతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.









