
నాప్స్కాబ్ డైరెక్టర్ గా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి నియామకం* *జాతీయస్థాయిలో కోఆపరేటివ్ వ్యవస్థలో కీలక భూమిక పోషించనున్న చైర్మన్*
*నాప్స్కాబ్ డైరెక్టర్ గా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి నియామకం* *జాతీయస్థాయిలో కోఆపరేటివ్ వ్యవస్థలో కీలక భూమిక పోషించనున్న చైర్మన్* *కుంభంకు పలువురు శుభాకాంక్షలు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 13 (మన ప్రజావాణి)*: గత ఏడాది కాలంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర ( డిసిసిబి ) బ్యాంక్ చైర్మన్ గా పనిచేస్తున్న కుంభం శ్రీనివాస్ రెడ్డి నాఫ్స్కాబ్ ( నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ) డైరెక్టర్ గా నియామకమయ్యారు. ఈ మేరకు శనివారం నాడు నాఫ్స్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ బీమా సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రగతి బాటలో పయనింపజేసేలా డి సి సి బి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి కృషి చేస్తున్న నేపథ్యంలో ఆయనకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం కల్పించారు. ఢిల్లీ కేంద్రంగా ఉండే నాప్స్కాబ్ కో-ఆపరేటివ్ బ్యాంకుల నుంచి రైతుల సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలలో డిసిసిబి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జాతీయ సాయి డైరెక్టర్ గా ఇకనుంచి కీలక భూమిక పోషించనున్నారు. డిసిసిబి చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నుండి కుంభం శ్రీనివాస్ రెడ్డి పాలకవర్గ సభ్యులతో పాటు అధికారులు ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ రైతుల సంక్షేమం కోసం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ను 3 వేల కోట్ల టర్నోవర్ కు తీసుకువెళ్లారు. అదేవిధంగా ఇటీవల లండన్ లో జరిగిన అంతర్జాతీయ కో-ఆపరేటివ్ సదస్సులో నాలుగు రోజులపాటు రాష్ట్రం తరఫున పాల్గొన్నారు. ఆయా దేశాలలో కో-ఆపరేటివ్ బ్యాంకుల తరఫున జరుగుతున్న సంక్షేమ పథకాలను ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం కోసం ప్రణాళికలను రూపొందించారు. వినయ, విధేయతలే ఆయనకు వరం. మారుమూల ప్రాంతమైన మునుగోడు మండలం కల్వకుంట గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ప్రతి ఒక్కరి తో వినయ, విధేయత ఉంటూ తన జీవన కొనసాగిస్తుంటాడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన ప్రభుత్వ పాఠశాలలకు కాలినడక నడిచి వెళ్లి విద్యను అభ్యసించి కొన్ని సంవత్సరాల పాటు జర్నలిస్టు గా పనిచేశాడు. ఆ పాత్రికేయ వృత్తి తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. తనకు పరిచయమైన వారితో స్నేహంగా ఉంటూ ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవసరమైన సహాయ సహకారాలను తీసుకునేవాడు. దాంతో ఓ స్థాయికి ఎదిగిన శ్రీనివాస్ రెడ్డి అందరి ఆత్మ బంధువు, మనసున్న మహారాజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసిన 2009లో శ్రీనివాస్ రెడ్డి రాజకీయాలకు వచ్చి రాజగోపాల్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉంటూ ఆయన సూచనల ప్రకారం రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటూ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే మునుగోడు పిఎసిఎస్ ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం 13 డైరెక్టు స్థానాలకు 12 స్థానాలు తానే గెలిపించుకొని మునుగోడు పిఎసిఎస్ చైర్మన్ గా ఎన్నికయ్యాడు. అంతేకాకుండా అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఏకైక డిసిసిబి డైరెక్టర్గా కూడా ఎన్నికయ్యాడు. గత ఏడాది క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గా ఎన్నికై రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలా ఆధారంగా ఆయనను జాతీయస్థాయిలో నాప్ స్కాబ్ డైరెక్టర్ గా నియమించడం పట్ల పాలకవర్గ డైరెక్టర్ల తోపాటు, అధికారులు ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాఫ్స్కాబ్ డైరెక్టర్గా నూతనంగా నియమించబడిన కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తనను నియమించిన మేనేజింగ్ డైరెక్టర్ బీమా సుబ్రహ్మణ్యం కు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఈ పదవితో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జాతీయస్థాయిలో కో-ఆపరేటివ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఉత్తంకుమార్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు.