
మూడవ ప్రపంచ యుద్ధం(3rd World War) మొదలైందా.. అవును అనే అంటోంది ఉక్రెయిన్(Ukraine). మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలతో దాదాపు అన్ని దేశాల ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చివేశాయి. కొన్ని నగరాలు నామరూపాలు లేకుండా తుడిచి పెట్టుకు పోతే.. కోట్లాది మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఆ యుద్ధాలు తలచుకొని కన్నీళ్ళు పెట్టని దేశం ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. చాలా పరిమిత సాంకేతిక ఉన్న ఆరోజుల్లోనే పరిస్థితి అలా ఉంటే.. మరి ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉంటుందో అనే ఊహనే వెన్నులో వణుకు పుట్టించడం ఖాయం. కాని మూడవ ప్రపంచ యుద్ధం మొదలైంది అంటూ ఉక్రెయిన్ మాజీ సైనికాధికారి చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. రష్యా(Russia) మిత్ర దేశాలు మూకుమ్మడిగా ఉక్రెయిన్ తో యుద్ధంలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం అని ఉక్రెయిన్ మాజీ సైన్యాధికారి వలెరీ జలూజ్నీ అన్నారు. ఉత్తర కొరియా, ఇరాన్ బలగాలు, ఆయుధాలను ప్రయోగించి ఉక్రెయిన్ అమాయకులను రష్యా హతమార్చి, మూడవ ప్రపంచ యుద్ధానికి రష్యా తెరలేపిందని వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా యుద్ధాన్ని ఇరు దేశాలకు మాత్రమే పరిమితం చేయాలని ఉక్రెయిన్ మిత్ర పక్షాలను ఆయన కోరారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025