
*అనంతగిరిలో గంజాయి ముఠా అరెస్ట్*
*గంజాయిని సేవించడంతోపాటు ఇతరులకు విక్రయిస్తున్న వైనం*
*నలుగురు నిందితులు అరెస్టు, పరారీలో ఇద్దరు నిందితులు*
*కోదాడ రూరల్ సీ.ఐ కె ప్రతాప్ లింగం*
అనంతగిరి ఆగస్టు 28 ( మన ప్రజావాణి ):
అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగలాయికోట గ్రామ శివారులో కృష్ణాపురం గ్రామానికి వెళ్ళు దారిలో గల పెరుమాల బండ వద్ద నిషేధిత గంజాయిని విక్రయిస్తూ, సేవిస్తుండగా గురువారం ఉదయం 9:30 సమయంలో అనంతగిరి పోలీసులు అరెస్టు చేశారు అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నేరస్తులు ఆరుగురు స్నేహితులు మరియు ఒకరికొకరు పరిచయస్తులు వీరు గంజాయి తాగడానికి అలవాటు అయ్యి గత కొన్ని రోజుల నుండి అక్రమంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గంజాయిని త్రాగడంతో పాటు విక్రయించడానికి కూడా అలవాటు అయినారు ఇట్టి క్రమంలోనే ఆగస్టు 28వ తేదీన గురువారం ఉదయం సమయంలో నేరస్తుడైన మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఓర్సు సాయిచరణ్, కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన షేక్ అలీమ్ (ఎలియాస్ సన్నీ తండ్రి మదర్ సాహెబ్) మరియు మాలోతు సాయికుమార్ (ఏలియా సాయి తండ్రి లక్ష్మా)లను కలిసి చేరి 100 గ్రాముల గంజాయిని ఇచ్చి తన మోటార్ సైకిల్ పై వెళ్లి మొగలాయికోట గ్రామానికి వెళ్లి, ఆ గ్రామ శివారులో గల కిష్టాపురం గ్రామానికి వెళ్ళుదారిలో పెరుమాల బండ వద్ద చెందిన సోమసాయి (ఎలియాస్ సాయికృష్ణ తండ్రి సత్యనారాయణ) మరియు కాపుగల్లు గ్రామానికి చెందిన మక్కా భాస్కర్ తండ్రి వెంకటయ్యలను అమ్మి వారి వద్ద నుండి తలా వెయ్యి రూపాయలు తీసుకొని రమ్మని చెప్పగా అతని ఆదేశాల మేరకు వీరిద్దరూ మోటార్ సైకిల్ పై మొగలాయికోట గ్రామ శివారులో గల పేరుమల బండ వద్దకు వెళ్లి సోమసాయి( ఏలియాస్ సాయి కృష్ణ) మరియు మక్కా భాస్కర్లకు గంజాయిని అమ్మడానికి ప్రయత్నిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు అనంతగిరి పోలీసు వారు మాటువేసి పట్టుబడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 200 గ్రాములు గంజాయిని,మోటార్ సైకిల్ ను, రెండు సెల్ ఫోన్ లను,2000 రూపాయలు లను మరియు గంజాయిని త్రాగడానికి ఉపయోగించే రెండు పేపర్ కవర్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. ఇట్టి గంజాయి విలువ సుమారు 5000 రూపాయల వరకు ఉంటుందని పైన తెలిపిన నేరస్థులను కోర్టు నందు హాజరు పరచడం జరుగుతుందని కోదాడ రూరల్ సి ఐ కే ప్రతాప్ లింగం తెలిపారు అందులో ఇద్దరు నిందితులు పరారీ లో ఉన్నట్లు తెలిపారు వారి వివరాలు ఓర్సు సాయిచరణ్ మేళ్లచెర్వు, సోమహర్షవర్ధన్ అనంతగిరి వీరిద్దరూ పరారీలో ఉన్నారని తెలిపారు ఇట్టి స్పెషల్ టాస్క్ లో కోదాడ రూరల్ సీఐ కే ప్రతాప్ లింగం, అనంతగిరి ఎస్సై ఎం నవీన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది అయిన రమేష్, నిరంజన్,ఏడుకొండలు మరియు సక్రు లు పాల్గొన్నారు
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025