
*అసంపూర్ణంగా ఉన్న ప్రెస్ క్లబ్ భావన శంకుస్థాపన ఈవీఎల్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 28 (మన ప్రజావాణి)*:
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రెస్ క్లబ్ భవన పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఈవీఎల్ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్. చండూరు మండల కేంద్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి విలేకరి వృత్తి ద్వారా సమసమాజ నిర్మాణం కొరకు పగలు రాత్రి తేడా లేకుండా అనునిత్యం సమాజంలో ఉన్న ప్రజల సమస్యలను వెలికి తీసే వారన్నారు. అలాంటి జర్నలిస్టులకు సమావేశాలు నిర్వహించడానికి మరియు కొంతసేపు వారు సేద తీర్చుకొనుటకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కలిపి ఈరోజు రెండంతస్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని తెలిపారు. అదేవిధంగా జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలవడానికి వారికి వారి కుటుంబానికి ఆరోగ్య భీమా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ భవన నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి వారికి అందజేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత జర్నలిస్టు కావలసిన మౌలిక సదుపాయాలను కూడా ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చండూరు మండలంలోని ప్రింట్ మరియు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025