
అమెజాన్ కంపెనీలో కార్మికుడి మృతి
హైతాబాద్ అమెజాన్ కంపెనీలో కార్మికుడు మృతి చెందిన పట్టించుకోని యాజమాన్యం
_అమెజాన్ కంపెనీలో కార్మికుడి మృతి .
_అమెజాన్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు.
కార్మికుడు మృతి చెందిన స్పందించని అమెజాన్ కంపెనీ యాజమాన్యం.
షాబాద్,ఆగస్టు 30
( మన ప్రజావాణి )
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం, రుద్రారం గ్రామానికి చెందిన అల్లాడ శేఖర్ (34). శుక్రవారం నాడు అర్ధరాత్రి సుమారు 11:30 గంటలకు డ్రైవింగ్ చేస్తుండగా ఆకస్మాత్తుగా స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మృతి. అమెజాన్ కంపెనీలో పని చేస్తున్నటువంటి అల్లాడ శేఖర్ అమెజాన్ కంపెనీలో డ్రైవింగ్ చేస్తుండగా స్పృహ కోల్పోయి చనిపోయిన పట్టించుకోని యాజమాన్యం, అమెజాన్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు.మృతుడు శేఖర్ భార్య ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు ,వారికి న్యాయం చేయాలని కంపెనీ ఎదుట ఆందోళన. అమెజాన్ కంపెనీలోని పనిచేస్తున్నటువంటి శేఖర్ చనిపోయిన యాజమాన్యానికి పట్టింపు లేదా పట్టించుకోరా అని నిలదీసి అడుగుతున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు అడ్డుకుంటున్న షాబాద్ పోలీసులు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025