ఎండపల్లి మండలం లో సజావుగా సాగిన ఎన్నికలు* *గ్రామ గ్రామాన కొలువు తీరిన నూతన పాలక వర్గం* జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి డిసెంబర్ 17(మన ప్రజావాణి):

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*ఎండపల్లి మండలం లో సజావుగా సాగిన ఎన్నికలు*

*గ్రామ గ్రామాన కొలువు తీరిన నూతన పాలక వర్గం*

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి డిసెంబర్ 17(మన ప్రజావాణి):

ఉత్కంఠ పోరుకు తెరపడింది, తెలంగాణలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా ముగిశాయి. నిన్న మొన్నటి వరకు ఓటర్లను ఆకట్టుకుంటూ ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులంతా ఊపిరి పీల్చుకున్నారు, గెలిచినవారు విజయోత్సవ ర్యాలీతో, ఓడినవారు “బెటర్ లక్ నెక్స్ట్ టైం” అంటూ సరిపెట్టుకున్నారు, ఈ సందర్భంగా గ్రామాల్లో నూతన సర్పంచులతో పండగ వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలంలో కొత్తగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచులు వీరే ఇందులో ఎండపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ గా మారం సునీతా – జలంధర్ రెడ్డి,
రాజారాంపల్లి లో సంఘ రమేష్,
గుల్లకోట లో గొల్లపల్లి మల్లేశం గౌడ్,
గోడిశెలపేట లో కందికట్ల అమృత – రాజేశం,
పాతగూడూర్ కొంగల జగదీశ్వర్ రెడ్డి,
చర్లపల్లి పడిధం మొగిలి,
అంబారిపేట దర్శనాల నరేష్,
ముంజంపల్లి సింగిరెడ్డి లింగారెడ్డి,
మారేడుపల్లి బాలసాని శారద – మల్లేశం గౌడ్,
సూరారం కోడిపెల్లి కొమురమ్మ – శ్రీనివాస్,
పడకల్ బెడ్డల ప్రవీణ్,
కొత్తపేట లో జీ రెడ్డి మహేందర్ రెడ్డి,
ఉండేడ ఆవుల మమత – తిరుపతి,
సానబండ లో గాదం భాస్కర్ లు ప్రత్యర్థులపై ఘనవిజయం సాధించారు.
కొండాపూర్ గ్రామంలో తాటిపర్తి రాజవ్వ (ఏకగ్రీవం) గా ఎన్నికైన విషయం తెలిసింది.
ఈ సందర్భంగా ఆయా సర్పంచ్ లు మాట్లాడుతూ…. మాపై అపారమైన నమ్మకం ఉంచి మాకు ఓటు వేసి గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న ఐదు సంవత్సరాలు గ్రామంలో ఉంటూ ప్రజల బాగోగులను చూసుకుంటూ గ్రామ సేవకై పాటుపడతామని నూతన సర్పంచులు తెలిపారు, అనంతరం గ్రామస్తులు పలు నాయకులు నూతనంగా గెలుపొందిన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న మొన్నటి వరకు మా చుట్టూ తిరగడమే కాకుండా ఇకపై కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రతి సమస్యపై పోరాటం చేయాలని వారు ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్