
*జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి. వేడుకలు*
….. *మహిళలకు ఆదర్శం సావిత్రిబాయి పూలే.*
నస్రుల్లాబాద్ జనవరి 3 (మన ప్రజావాణి ) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజున గిరిజన గురుకుల పాఠశాల లో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇవాళ సావిత్రిబాయి పూలే మహిళలకు ఆదర్శమని ప్రిన్సిపల్ విస్లావత్ మాధవరావు అన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విస్లావత్ మాధవరావు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.మనకున్నది ఒకే ఒక ఒక శత్రువు ఆ శత్రువే అజ్ఞానం విద్యావంతులమైన ఆ శక్తుని తుద ముట్టించడమే మన లక్ష్యం అని సావిత్రిబాయి పూలే చేసిన వాక్యలు విద్యకు ఆమె ఇచ్చిన ప్రాముఖ్యతను తెలుపుతున్నాయి. సావిత్రిబాయి పూలే 1931 వ జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లా నయగావ్ గ్రామంలో జన్మించారు. జ్యోతిరావు పూలే అడుగుజాడలో నడిచి సమసమాజ స్థాపన కోసం అనునిత్యం ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే ఒక మాటలో చెప్పాలంటే భర్త జ్యోతిరావు పూలే వెలిగించిన జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి. స్త్రీ విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విస్లావత్ మాధవరావు, మహిళా ఉపాధ్యాయురాలు సువర్ణ, వీణ, రాజశ్రీ, భారతి, రాధా, ఉపాధ్యాయులు, అశ్విన్, పి ఈ టి ప్రవీణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు,








