సబ్‌స్టేషన్లలో ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు

Ramesh

Ramesh

District Chief Reporter

రాష్ట్రవ్యాప్తంగా వేసవిలో నమోదయ్యే విద్యుత్‌డిమాండ్‌లో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈమేరకు ఆయన తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోలతో పాటు డిస్కంలు పటిష్ట చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తన కార్యాలయంలో శనివారం సుల్తానియా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సమ్మర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 5 శాతం, గ్రేటర్‌లో 15 శాతం విద్యుత్‌డిమాండ్‌ అధికంగా నమోదైన నేపథ్యంలో ఆ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఏడాది సమ్మర్‌ నాటికి ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలని స్పష్టంచేశారు. ఈహెట్‌టీ, 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంచాలని, అవసరమైన ప్రాంతాల్లో కొత్త పీటీఆర్‌లు ఏర్పాటు చేయాలని సీఎండీలను ఆదేశించారు. సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టిన పనులు జనవరి 31 వరకు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు.

డిమాండ్‌ రికార్డుస్థాయిలో పెరిగే ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లలో కొత్త పీటీఆర్‌లు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. ఆర్సీపురం, బౌరంపేట ప్రాంతాల్లో ట్రాన్స్‌కో ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంచుతున్నట్లు సీఎండీలు ముఖ్య కార్యదర్శికి వివరించారు. నిర్మాణంలో ఉన్న జడ్చర్ల, నారాయణపూర్‌ 132 కేవీ సర్క్యూట్ ను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ పరిధిలో సమ్మర్‌యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన మరమ్మతు పనులు శరవేగంగా చేస్తునట్లు పేర్కొన్నారు. ఈ సమీక్షలో తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్‌ , దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ, ఉత్తర డిస్కం సీఎండీ వరుణ్‌ రెడ్డి, ట్రాన్స్ కో జాయింట్ ఎండీ శ్రీనివాసరావు, పలువురు విద్యుత్‌ సంస్థల డైరెక్టర్లు, చీఫ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్