విశాఖలో జోన్‌ కార్యాలయం.. టెండర్లు ఆహ్వానించిన రైల్వే శాఖ

Ramesh

Ramesh

District Chief Reporter

విశాఖలో రైల్వే జోన్ కార్యాలయ (Vizag Railway Zone Office) ఏర్పాటుకు కీలక అడుగు పడింది. జోనల్ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఏపీలో కూటమి సర్కార్ వచ్చాక 53 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించింది. దాంతో జోన్ కార్యాలయం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ షురూ అయింది. విశాఖలో నిర్మించే ఈ కార్యాలయాన్ని రూ.149.16 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. డిసెంబర్ 27 లోగా టెండర్లను దాఖలు చేయాలని, టెండర్లు దక్కించుకున్నవారు భవన నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలన్న నిర్దేశాలు జారీ చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share