
అమెరికాలోని మరో కీలక పదవికి భారతీయుడని నియమించేందుకు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అమెరికాలో మెడికల్ రీసెర్చ్ లను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు కొత్త డైరెక్టర్ గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను నియమించాలని ట్రంప్ (Donald Trump ) ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తాసంస్థ ‘వాషింగ్టన్ పోస్టు’ కథనంలో పేర్కొంది. ఎన్ఐహెచ్ డైరెక్టర్ పదవి రేసులో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అయితే, ట్రంప్ మద్దతు మాత్రం జై వైపు ఉందని వాషింగ్టన్ పోస్టు తెలిపింది. ఇక, జై స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఫిజీషియన్, ఆర్థికవేత్తగా శిక్షణ పొందారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చిలో జై అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక స్టాన్‌ఫోర్డ్‌లో ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సెంటర్ ఫర్ డెమోగ్రఫీ అండ్ ఎకనామిక్ ఆఫ్ హెల్త్ అండ్ ఏజినింగ్ డైరెక్టర్‌గానూ ఉన్నారు.