మరోసారి అక్కినేని హీరోతో రొమాన్స్ చేయబోతున్న బుట్టబొమ్మ..? థ్రిల్లింగ్ సస్పెన్స్ అంటూ వచ్చేస్తున్నారోచ్..

Ramesh

Ramesh

District Chief Reporter

అక్కినేని హీరో నాగ చైతన్య, పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ జంటగా ‘ఒక లైలా కోసం’ అనే మూవీలో నటించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. అయితే ఇప్పుడు త్వరలోనే వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన కార్తీక్ వర్మ దండు ఇప్పుడు తెరకెక్కించనున్న ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాలో నాగ చైతన్య నటించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డేను మేకర్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారట. దీంతో వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ సెట్ కానున్నదని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో నిజంగానే చైతన్య, పూజ కాంబో ఫిక్స్ అవుతోందో లేదో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ సినిమాలో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక బుట్ట బొమ్మ విషయానికి వస్తే దాదాపు ఏడాదిగా సినిమాలకు దూరం ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం 5 వరుస చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share