అసిడిటీ సమస్యకు చేక్ పెట్టాలంటే. ఈ నాలుగు ఆహారాలు బెస్ట్.??

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ వ్యాధులలో ఎసిడిటీ సమస్య కూడా ఒకటి.

ఇలాంటి పరిస్థితులలో అసిడిటీని తగ్గించడానికి సరైన ఆహారపు అలవాట్లను పాటించడం చాలా అవసరం. అలాగే స్పైసీ ఫుడ్ ను తీసుకోవడం కూడా మానుకోవాలి. అలాగే మీరు అసిడిటీని తగ్గించడానికి మందులకు బదులుగా కొన్ని ఆహారాలను తీసుకోవాలి. అయితే అసిడిటీని తగ్గించడానికి ఏ ఆహారాలు హెల్ప్ చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

రోజు బాదం పప్పులు తీసుకుంటే అసిడిటీ సమస్య తగ్గిపోతుంది : బాదంపప్పులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన కడుపు నిండుగా అనిపిస్తుంది. దీనివలన మీకు మళ్ళీ తినాలి అనే కోరిక ఉండదు. అలాగే అసిడిటీ నుండి కూడా ఈజీగా బయటపడొచ్చు. అయితే ఇది మాత్రమే కాకుండా బాదంపప్పు అనేది కడుపులో ఉండే యాసిడ్ ను గ్రహిస్తుంది మరియు గుండెల్లో మంటను కూడా తగ్గిస్తుంది.

 

ప్రతిరోజు పుదీనా ఆకులను తీసుకోవడం వలన కడుపు అనేది చల్లగా ఉంటుంది. అలాగే మీరు యాసిడ్ రీప్లేక్స్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు పుదీనా చట్నీని తీసుకుంటే మంచిది. దీనిని తీసుకోవడం వలన పొట్టకు తాజాదనం అనేది వస్తుంది. అలాగే మీరు కడుపు నొప్పి మరియు ఛాతిలో మంట నుండి ఉపశమనం పొందవచ్చు…

అల్లంతో అసిడిటీకి చెక్ : అల్లం లో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు మిమ్మల్ని అసిడిటీ నుండి కాపాడుతుంది. దీని వాడకం వలన మీ జీర్ణ వ్యవస్థను కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కడుపునొప్పి సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ అల్లం ను మీరు టీ లేక ఏదైనా పానీయాల్లో కలిపి కూడా తీసుకోవచ్చు…

బొప్పాయి జీర్ణవ్యవస్థకు మంచిది : బొప్పాయి లో పపైన్ అనే జీర్ణ ఎంజైమ్ లు ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే జీవక్రియను కూడా పెంచుతుంది. దీనికి కారణం చేత మీరు అసిడిటీ సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. అంతేకాక మీరు బొప్పాయిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share