
ప్రతి ఒక్క అమ్మాయి అందంగా కనిపించాలి అని ఖచ్చితంగా కోరుకుంటుంది. అయితే దానికి మీరు ఏం చేస్తున్నారు అన్నది కూడా చాలా అవసరం. అయితే కేవలం క్రీమ్స్ మరియు పౌడర్ వేసుకుంటే అందంగా కనిపించరు.
మన చర్మ ఆరోగ్యం అనేది లోపల నుండి ఉండాలి. మీరు తీసుకుంటున్న ఆహారం సరైనది అయితే మీరు ఎప్పుడు కూడా అందమైన చర్మాన్ని పొందుతారు. అలాగే మనల్ని అందంగా కనిపించేలా చేసేవి మన చుట్టూ చాలా ఉన్నాయి. అలాగే కొన్ని కూరగాయలను తీసుకోవడం వలన మన చర్మం అనేది ఎంతో అందంగా మారుతుంది. అలాగే మన చర్మానికి ఎంతో పోషణ కూడా లభిస్తుంది.
మనకు కూరగాయలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మంచి పోషకాలు దొరుకుతాయి. అలాగే మనకు దొరికే కూరగాయలు అన్నీ కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా మన చర్మాన్ని కూడా అందంగా మారుస్తుంది. అంతేకాక ఆకుకూరలు కూడా మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కూడా పోషకాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి…
అయితే ఈ కూరగాయలలో కాలే మరియు బచ్చలి కూర, క్యాబేజీ లాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే చర్మాని ఎంతో అందంగా మారుస్తాయి. అలాగే టమాటా మరియు క్యారెట్ లాంటి వాటిని కూడా ప్రతిరోజు తీసుకుంటే మన చర్మానికి రక్షణగా నిలుస్తాయి. వీటిలో విటమిన్ సి కె మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మన చర్మంపై గీతలు మరియు ముడతలు రాకుండా స్కిన్ ను సాఫ్ట్ గా మరియు మెత్తగా మారుస్తాయి