
*2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్*
వచ్చే మూడేళ్లలో (2028 కల్లా) ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అమెరికా ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఐదవ స్థానంలో ఉన్న భారత్.. 2026లో అమెరికా, చైనా, జర్మనీ తరువాత స్థానానికి, ఆ తదుపరి రెండేళ్లలో జర్మనీని అధిగమించి మూడో స్థానానికి ఎదుగుతుందని వివరించింది…..