
భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..!
భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు
ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణంగా పేర్కొన్న ప్రధాని
ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ప్రత్యేక పోస్టు
భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతకు యునెస్కో గుర్తింపు దక్కింది. భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి కూడా ఈ గుర్తింపు దక్కడం విశేషం. భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపుగా వీటికి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది.
భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు.
"ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ క్షణం. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత, నాట్యశాస్త్రాన్ని చేర్చడం మన గొప్ప సంస్కృతి, జ్ఞానానికి దక్కిన గుర్తింపు. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. వారి అంతర్దృష్టులు ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి" అని ప్రధాని మోదీ తన 'ఎక్స్' పోస్టులో రాసుకొచ్చారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025