
"ఎఫ్.టి.ఎఫ్ (నిధుల బదిలీ ఉత్తరువు) పత్రాలపై ఆర్మూర్ పంచాయతి రాజ్ శాఖ లోని మాజీ కార్యనిర్వాహక ఇంజనీరు మరియు ప్రస్తుత నిజామాబాద్ పంచాయతి రాజ్ శాఖ లోని కార్యనిర్వాహక ఇంజనీరు యొక్క సంతకం పొందడం కొరకు" అధికారిక సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.7,500/- లంచం డిమాండ్ చేసి, అభ్యర్ధనమేరకు తగ్గించిన లంచం రూ.7,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన ఆర్మూర్ పంచాయతీ రాజ్ శాఖ లోని కార్యనిర్వాహక ఇంజనీరు వారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఎన్. శ్రీనివాస శర్మ."
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025