ఏసీబీ వలలో ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్..!

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ఏసీబీ వలలో ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్..!

తల్లంపాడు ఓ రైతు నుండి డబ్బులు డిమాండ్

30000 లంచం స్వీకరిస్తూ పట్టుబడ్డ వైనం

ప్రైవేటు వ్యక్తుల ద్వారా లావాదేవీలు ఎన్నో..?

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

గత కొంతకాలంగా పనికి ఓ రేటు చొప్పున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు పత్రికలు ప్రముఖంగా ఇటీవల కాలంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలు విచారణలు ఎదుర్కొన్న కానీ పనితీరులో మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడంతో లంచం సమర్పించుకోలేక కొందరు రైతులు వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. పూర్తి వివరాల్లోకెళ్తే ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని పలువురు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు కు చెందిన రైతు భూమి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్ తో సంబంధిత పత్రాలు తయారు చేసుకున్న తర్వాత సదరు సబ్ రిజిస్టార్ అరుణ బాధిత రైతు నుండి 50వేల రూపాయలను లంచంగా డిమాండ్ చేయడంతో కుదిరిన లావాదేవీల మేరకు 30 వేల రూపాయలను సోమవారం అందజేస్తుండగా ఏసీబీ డిఎస్పి వై రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ చాకచక్యంగా మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్వరావు కూడా అదుపులోకి తీసుకొని రిజిస్టార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించడంతో ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. కాగా కార్యాలయం పనిచేసే రోజులలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ నిత్యం బిజీ బిజీగా ఉంటారని పలువురు ఆరోపిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్