*ఫీజుల మోత — గుండె గుబులు* *–తలిదండ్రుల్లో మొదలైన ఆందోళన.!* *–జూన్ వస్తుందంటేనే టెన్షన్ టెన్షన్* *–మధ్యతరగతి తల్లిదండ్రులకు స్కూళ్ల భయం*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*ఫీజుల మోత — గుండె గుబులు*

*–తలిదండ్రుల్లో మొదలైన ఆందోళన.!*

*–జూన్ వస్తుందంటేనే టెన్షన్ టెన్షన్*

*–మధ్యతరగతి తల్లిదండ్రులకు స్కూళ్ల భయం*

*–డోనేషన్లు, టర్మ్ ఫీజులు*

*–బ్యాగులు, పుస్తకాల భారం*

*–ప్రైవేటు బడుల్లో ఫీజుల మోత*

*–విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.లక్ష.. భారం*

*నల్గొండ జిల్లా బ్యూరో/ చండూర్ జూన్ 2 (మన ప్రజావాణి)*:

జూన్ నెల వచ్చిందంటే సామాన్యులకు దడ మొదలైనట్లే.! స్కూళ్ల ప్రారంభం నేపథ్యంలో ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, బ్యాగులు ఇతర సామగ్రి కొనుగోళ్లతో తల్లిదండ్రులకు చుక్కలు కనపడతాయి. అయితే నియంత్రణ అనేది లేకపోవడంతో ఈసారి స్పెషల్ ఎఫెక్ట్ అన్నట్లు ఫీజుల భారం రెట్టింపైంది. ఇటు ఇంటి అద్దెలు పెరిగాయి. ఆపై నిత్యావసర ధరల పెరుగుదల, ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఒక్కో కుటుంబానికి ఈ నెలలో సుమారు లక్షలకు పైనే ఖర్చు వచ్చిపడటంతో, చాలీచాలని వేతనాలతో, పైసా పైసా కూడబెట్టుకునే సామాన్యులు ఈ నెల గడిచేదెలా అంటూ ఆందోళన చెందుతున్నారు.

పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఖర్చుల గుబులు నెలకొంది. 11 నెలల పాటు ఏదో ఒక విధంగా నెట్టు కొచ్చిన పేద, మధ్యతరగతి కుటుంబాలు జూన్ వచ్చిందంటేనే భయపడిపోతున్నారు. అమ్మో.. జూన్ అంటూ నోరెళ్లబెడుతున్నారు. నెలరోజులపాటు వేసవి సెలవుల్లో ఆటపాటలతో ఆనందంగా గడిపిన విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతుండగా, వారి తల్లిడండ్రులు మాత్రం ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఏటికేడు పెరుగుతున్న స్కూలు, కాలేజీల ఫీజులు, అందుకయ్యే ఖర్చు తలచుకుం టేనే వారి గుండె గుభేలుమంటోంది. నెలవారీ జీతాలపై నే ఆధారపడి జీవితాలను నెట్టుకొచ్చే మధ్యతరగతి కుటుంబాలు సతమతమవుతున్నాయి. ఇంటి బడ్జెట్ తో పాటు, పిల్లల స్కూల్ ఫీజుల బడ్జెట్ పై కసరత్తు మొదలు పెడతారు. ప్రతీ కుటుంబంపై జూన్ లో రూ.50 వేల నుంచి రూ. లక్షవరకు స్కూల్ ఖర్చులు ఉంటాయి. నూతన విద్యా సంవత్సరానికి కొద్ది రోజులు మాత్రమే ఉడడం తో.. ఇప్పటి నుండే తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పాఠశాలలు తెరచుకోవడానికి ముందే విద్యార్ధులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాం, షూ కొనుగోలు చేయడంతోపాటు ఫీజుల మోతను ఎదుర్కోవడానికి తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ ను తల కిందులు చేస్తోంది. కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు కూడా భారీగా పెంచారు. ప్రభుత్వం ఈసారి సకాలం లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందించడానికి చర్యలు చేపట్టింది.

ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల
కోసం ప్రైవేట్ దుకానాలలో పుస్తకాల అమ్మకాలు మొదలు పెట్టారు. ఈ సారి పుస్తకాల ధరలు స్వల్పం గానే పెరిగినా, సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల ధరలు ఈ సారి తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కానీ వీటికి సంబంధించిన కొశ్చన్ బ్యాంక్లు, ఇతర సామగ్రి కొనుగోలుకు మధ్యతరగతి కుటుంబాలు డబ్బులు సమకూర్చుకోవడానికి హడలిపోతున్నారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కు వెళ్లే పిల్లలు ఉంటే బంగారం వంటి వస్తువులు తాకట్టు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు అడ్మిషన్లు, పుస్తకాలు అయిపోతా యంటూ ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న ప్రచారం కూడా అంతా ఇంతా కాదు. వేసవి పోయి వాతావరణం చల్లబడిందనే సంతోషం కంటే.. జూన్ నుంచి ఎలా గటెక్కాలో తెలియని పరిస్థితి పేద కుటుంబాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని వ్యవసాయ కుటుంబాలు తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని ఆరాట పడుతున్నాయి. ఇందుకు ప్రైవేటు విద్యవైపు మొగ్గు చూపుతుండడంతో మోయలేని భారంగా మారుతోంది. ప్రైవేటు, వివిధ రకాల పేరుతో ఫీజులు వసూళ్లు చేస్తున్నారు.

*–పెన్సిల్ నుంచి పుస్తకాల వరకూ మోతే…*

పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయంటే తల్లిదండ్రులకు గుర్తుచ్చేది ఫీజులు, పుస్తకాలే, ముఖ్యంగా స్కూలులో అడుగు పెట్టాలంటే పుస్తకాలు, నోట్ పుస్తకాల తోపాటు, వాటిని భద్రపరుచుకునేందుకు భారీ బ్యాగులు, దానికి తోడు లంచ్ బాక్స్, పెన్ను, పెన్సిల్ ఇలా ఒకటేమిటి రకరకాల వస్తువులు కొనుగోలు తప్పనిసరి. గతంలో విద్యార్థులు కావాల్సిన పుస్తకాలు తమ కిష్టమొచ్చిన దుకాణంలో కొనుక్కునేవారు. అయితే ఇప్పుడు ప్రైవేటు పాఠశాలల పంథా మారింది. పుస్తకాలు, బెల్టు, టై, యూనీఫాం అన్నీ ఆయా పాఠశాల్లోనే కొనాల్సిన పరిస్థితి, దీంతో పాఠశాలల యాజమాన్యాలు చెప్పిన ధర చెల్లించలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఒకవైపు ఆర్థికభారం.. మరోవైపు పిల్లాడి భవిష్యత్ కోసం మౌనం గానే ముందడుగు వేస్తున్నారు. అడ్మిషన్ నుంచి తరగతి గదిలో అడుగు పెట్టేంత వరకు తల్లిదండ్రులకు కంటి మీద కునుకు కరువైపోతుందని వాపోతున్నారు.

*–యూనిఫాం.. ఇతర ఖర్చుల భారం..*

పాఠశాలలు తెరుచుకోవడంతోనే ఫీజులు చెల్లింపు, ఇతర ఖర్చులు ఇబ్బందులకు గురి చేస్తాయి. పిల్లలను బడికి పంపడానికి యూనిఫాం ఇతర సామగ్రి కొనుగోలు కష్టంగా మారుతుంది. పుస్తకాలు, డ్రెస్, షూ, సాధారణ దుస్తుల ఖర్చు, బస్సు ఫీజులు ఇలా అనేక విషయాలపై తల్లిదండ్రులు లెక్కలు వేసుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో బయట నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు కోనుగోలుకు ఒప్పుకోరు. పాఠ్యపుస్తకాలు, బ్యాడ్జీలు, పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలి. యాజమాన్యాలు నిర్ణీయించిన రేటుకు తీసుకునేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.

*–అదనంగా రూ.50 వేల ఖర్చు..*

ఎల్ కేజీ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియెట్ వరకు టర్మ్ ఫీజులు, బస్సు రవాణా, ఇతరాలు కలిపితే రూ. 15 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అవుతోంది. కార్పొరేట్ స్థాయికి వెళ్తే రూ.లక్ష వరకు ఖర్చు అవుతోంది. పిల్లల చదువుల కోసం మధ్య తరగతి కుటుంబాలు కార్పొరేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇంజనీరింగకు ఫీజురీయింబర్స్మెంట్ మినహయించినా కళశాలల ఫీజులు రూ. లక్షల్లోనే ఉన్నాయి. మరోవైపు హాస్టల్ ఫీజులు అదనపు భారం. ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ ఫీజులు వేలల్లో ఉన్నాయి. దీనికి తోడు ఈవెంట్స్ పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నారు. పుస్తకాలతో పాటు బ్యాగ్లు టిఫిన్ బాక్సుల రేట్లు మండి పోతున్నాయి.

–ఒక్కో కుటుంబంపై లక్షల్లో భారం..

ఒకవైపు నిత్యావసర సరుకులు, వివిధ ఖర్చులు అడ్డగోలుగా పెరిగిపోయాయి. దీంతో ఏ నెలకానెల ఆదాయ, వ్యయాలపై ఆచితూచి అడుగులు వేస్తున్న వారిలో వేతన జీవులు, చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు ఉన్నారు. అయితే విద్య విషయంలో పెరిగిన అవగాహన నేపథ్యంలో అందరూ పిల్లలను ఉన్నతంగా చది నించాలనే తలంపుతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సాధారణ రోజుల్లోనే నగరంలోని ఒక చిన్న కుటుంబం ఇంటి అవసరాలకు రూ.25 నుంచి రూ.30వేల వరకు ఖర్చవు తుండగా, ఈ నెలలో ఇంటి అవసరాలు పక్కనపెడితే పిల్లల స్కూలు కోసం ఒక్కొక్కరికీ రూ.50వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తుంది. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇక అంతే.. జూన్ లో లక్షకు పైనే ఖర్చు అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇకపోతే పదవ తరగతి పాసైన విద్యార్థుల ఇళ్లలో అంతకు రెట్టింపు ఆందోళన ఉంది. ఇంటర్ ఏ కాలేజిలో చేర్చాలి. డేస్కాలరా, హాస్టల్లో నా.. అనే ఆలోచనతోపాటు, ఆయా కాలేజీల గుర్తింపు ను బట్టి విద్యార్థికి అక్షరాల లక్షపైనే ఖర్చవుతోంది.
మరోవైపు పెరిగిన నిత్యావసర సరకుల ధరలు, కూరగాయల ధరల పెరుగుదలతో జూన్ మాసం, పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఓ వణుకు పుట్టిస్తోంది. అన్నట్లు ఫీజుల భారం రెట్టింపైంది. ఇటు ఇంటి అద్దెలు పెరిగాయి. ఆపై నిత్యావసర ధరల పెరుగుదల, ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఒక్కో కుటుంబానికి ఈ నెలలో సుమారు లక్షలకు పైనే ఖర్చు వచ్చిపడటంతో, చాలీచాలని వేతనాలతో, పైసా పైసా కూడబెట్టుకునే సామాన్యులు ఈ నెల గడిచేదెలా అంటూ ఆందోళన చెందుతున్నారు.

పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఖర్చుల గుబులు నెలకొంది. 11 నెలల పాటు ఏదో ఒక విధంగా నెట్టు కొచ్చిన పేద, మధ్యతరగతి కుటుంబాలు జూన్ వచ్చిందంటేనే భయపడిపోతున్నారు. అమ్మో.. జూన్ అంటూ నోరెళ్లబెడుతున్నారు. నెలరోజులపాటు వేసవి సెలవుల్లో ఆటపాటలతో ఆనందంగా గడిపిన విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతుండగా, వారి తల్లిడండ్రులు మాత్రం ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఏటికేడు పెరుగుతున్న స్కూలు, కాలేజీల ఫీజులు, అందుకయ్యే ఖర్చు తలచుకుం టేనే వారి గుండె గుభేలుమంటోంది. నెలవారీ జీతాలపై నే ఆధారపడి జీవితాలను నెట్టుకొచ్చే మధ్యతరగతి కుటుంబాలు సతమతమవుతున్నాయి. ఇంటి బడ్జెట్ తో పాటు, పిల్లల స్కూల్ ఫీజుల బడ్జెట్ పై కసరత్తు మొదలు పెడతారు. ప్రతీ కుటుంబంపై జూన్ లో రూ.50 వేల నుంచి రూ. లక్షవరకు స్కూల్ ఖర్చులు ఉంటాయి. నూతన విద్యా సంవత్సరానికి కొద్ది రోజులు మాత్రమే ఉడడం తో.. ఇప్పటి నుండే తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పాఠశాలలు తెరచుకోవడానికి ముందే విద్యార్ధులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాం, షూ కొనుగోలు చేయడంతోపాటు ఫీజుల మోతను ఎదుర్కోవడానికి తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ ను తల కిందులు చేస్తోంది. కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు కూడా భారీగా పెంచారు. ప్రభుత్వం ఈసారి సకాలం లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందించడానికి చర్యలు చేపట్టింది.

ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల
కోసం ప్రైవేట్ దుకానాలలో పుస్తకాల అమ్మకాలు మొదలు పెట్టారు. ఈ సారి పుస్తకాల ధరలు స్వల్పం గానే పెరిగినా, సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల ధరలు ఈ సారి తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కానీ వీటికి సంబంధించిన కొశ్చన్ బ్యాంక్లు, ఇతర సామగ్రి కొనుగోలుకు మధ్యతరగతి కుటుంబాలు డబ్బులు సమకూర్చుకోవడానికి హడలిపోతున్నారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కు వెళ్లే పిల్లలు ఉంటే బంగారం వంటి వస్తువులు తాకట్టు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు అడ్మిషన్లు, పుస్తకాలు అయిపోతా యంటూ ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న ప్రచారం కూడా అంతా ఇంతా కాదు. వేసవి పోయి వాతావరణం చల్లబడిందనే సంతోషం కంటే.. జూన్ నుంచి ఎలా గటెక్కాలో తెలియని పరిస్థితి పేద కుటుంబాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని వ్యవసాయ కుటుంబాలు తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని ఆరాట పడుతున్నాయి. ఇందుకు ప్రైవేటు విద్యవైపు మొగ్గు చూపుతుండడంతో మోయలేని భారంగా మారుతోంది. ప్రైవేటు, వివిధ రకాల పేరుతో ఫీజులు వసూళ్లు చేస్తున్నారు.

–పెన్సిల్ నుంచి పుస్తకాల వరకూ మోతే…

పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయంటే తల్లిదండ్రులకు గుర్తుచ్చేది ఫీజులు, పుస్తకాలే, ముఖ్యంగా స్కూలులో అడుగు పెట్టాలంటే పుస్తకాలు, నోట్ పుస్తకాల తోపాటు, వాటిని భద్రపరుచుకునేందుకు భారీ బ్యాగులు, దానికి తోడు లంచ్ బాక్స్, పెన్ను, పెన్సిల్ ఇలా ఒకటేమిటి రకరకాల వస్తువులు కొనుగోలు తప్పనిసరి. గతంలో విద్యార్థులు కావాల్సిన పుస్తకాలు తమ కిష్టమొచ్చిన దుకాణంలో కొనుక్కునేవారు. అయితే ఇప్పుడు ప్రైవేటు పాఠశాలల పంథా మారింది. పుస్తకాలు, బెల్టు, టై, యూనీఫాం అన్నీ ఆయా పాఠశాల్లోనే కొనాల్సిన పరిస్థితి, దీంతో పాఠశాలల యాజమాన్యాలు చెప్పిన ధర చెల్లించలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఒకవైపు ఆర్థికభారం.. మరోవైపు పిల్లాడి భవిష్యత్ కోసం మౌనం గానే ముందడుగు వేస్తున్నారు. అడ్మిషన్ నుంచి తరగతి గదిలో అడుగు పెట్టేంత వరకు తల్లిదండ్రులకు కంటి మీద కునుకు కరువైపోతుందని వాపోతున్నారు.

–యూనిఫాం.. ఇతర ఖర్చుల భారం..

పాఠశాలలు తెరుచుకోవడంతోనే ఫీజులు చెల్లింపు, ఇతర ఖర్చులు ఇబ్బందులకు గురి చేస్తాయి. పిల్లలను బడికి పంపడానికి యూనిఫాం ఇతర సామగ్రి కొనుగోలు కష్టంగా మారుతుంది. పుస్తకాలు, డ్రెస్, షూ, సాధారణ దుస్తుల ఖర్చు, బస్సు ఫీజులు ఇలా అనేక విషయాలపై తల్లిదండ్రులు లెక్కలు వేసుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో బయట నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు కోనుగోలుకు ఒప్పుకోరు. పాఠ్యపుస్తకాలు, బ్యాడ్జీలు, పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలి. యాజమాన్యాలు నిర్ణీయించిన రేటుకు తీసుకునేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.

–అదనంగా రూ.50 వేల ఖర్చు..

ఎల్ కేజీ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియెట్ వరకు టర్మ్ ఫీజులు, బస్సు రవాణా, ఇతరాలు కలిపితే రూ. 15 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అవుతోంది. కార్పొరేట్ స్థాయికి వెళ్తే రూ.లక్ష వరకు ఖర్చు అవుతోంది. పిల్లల చదువుల కోసం మధ్య తరగతి కుటుంబాలు కార్పొరేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇంజనీరింగకు ఫీజురీయింబర్స్మెంట్ మినహయించినా కళశాలల ఫీజులు రూ. లక్షల్లోనే ఉన్నాయి. మరోవైపు హాస్టల్ ఫీజులు అదనపు భారం. ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ ఫీజులు వేలల్లో ఉన్నాయి. దీనికి తోడు ఈవెంట్స్ పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నారు. పుస్తకాలతో పాటు బ్యాగ్లు టిఫిన్ బాక్సుల రేట్లు మండి పోతున్నాయి.

–ఒక్కో కుటుంబంపై లక్షల్లో భారం..

ఒకవైపు నిత్యావసర సరుకులు, వివిధ ఖర్చులు అడ్డగోలుగా పెరిగిపోయాయి. దీంతో ఏ నెలకానెల ఆదాయ, వ్యయాలపై ఆచితూచి అడుగులు వేస్తున్న వారిలో వేతన జీవులు, చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు ఉన్నారు. అయితే విద్య విషయంలో పెరిగిన అవగాహన నేపథ్యంలో అందరూ పిల్లలను ఉన్నతంగా చది నించాలనే తలంపుతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సాధారణ రోజుల్లోనే నగరంలోని ఒక చిన్న కుటుంబం ఇంటి అవసరాలకు రూ.25 నుంచి రూ.30వేల వరకు ఖర్చవు తుండగా, ఈ నెలలో ఇంటి అవసరాలు పక్కనపెడితే పిల్లల స్కూలు కోసం ఒక్కొక్కరికీ రూ.50వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తుంది. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇక అంతే.. జూన్ లో లక్షకు పైనే ఖర్చు అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇకపోతే పదవ తరగతి పాసైన విద్యార్థుల ఇళ్లలో అంతకు రెట్టింపు ఆందోళన ఉంది. ఇంటర్ ఏ కాలేజిలో చేర్చాలి. డేస్కాలరా, హాస్టల్లో నా.. అనే ఆలోచనతోపాటు, ఆయా కాలేజీల గుర్తింపు ను బట్టి విద్యార్థికి అక్షరాల లక్షపైనే ఖర్చవుతోంది.
మరోవైపు పెరిగిన నిత్యావసర సరకుల ధరలు, కూరగాయల ధరల పెరుగుదలతో జూన్ మాసం, పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఓ వణుకు పుట్టిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్