కోదాడ పట్టణంలో అంతరాష్ట్ర కిడ్నీరాకెట్ ముఠా అరెస్ట్.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

కోదాడ పట్టణంలో అంతరాష్ట్ర కిడ్నీరాకెట్ ముఠా అరెస్ట్..

సూర్యాపేట జిల్లా కోదాడ, జూన్ 25/మన ప్రజావాణి.

సినిమాలకు దీటైన మోసాలు కోదాడలో వెలుగులోకి రావడంతో ప్రజల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. తాజాగా కోదాడ పట్టణంలో అంతరాష్ట్ర కిడ్నీరాకెట్ ముఠా ఒకటి పోలీసుల చేతికి చిక్కింది. ఈ విషయాన్ని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పదిమంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి, విజయవాడలోని కిడ్నీ డయాలసిస్ సెంటర్ల వద్ద కిడ్నీ వ్యాధిగ్రస్తులను లక్ష్యంగా చేసుకుని, కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికే స్కామ్‌కు పాల్పడినట్లు తెలిపారు. చికిత్సకు అవసరమైన అనుమతులు, ధృవీకరణలు, రక్త నమూనాలు అన్నీ ఫోర్జరీ పత్రాలతో సిద్ధం చేసి, బాధితులను మరియు దాతలను ఏర్పాటుచేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.అయితే ఆపరేషన్ సమయం దగ్గరపడినప్పుడు, ముఠా సభ్యులు బాధితులను వదిలేసి పారిపోతూ, డబ్బులను పంచుకునే కుతంత్రం చేపట్టినట్లు చెప్పారు. గతేడాది డిసెంబరులో కోదాడ శ్రీరంగపురానికి చెందిన నరేష్ అనే వ్యక్తి ఇదే విధంగా మోసానికి గురై, 22 లక్షలు కోల్పోయినట్లు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ఇప్పటివరకు ఈ ముఠా ద్వారా దాదాపు పదిమందికి పైగా చట్టవిరుద్ధంగా కిడ్నీలు మార్పిడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.ముఠాలో ఆరుగురు.. కడుపూరి తాతారావు, కొండా రమాదేవి, బొందిలి పృథ్వీరాజు, కొడాలి బాబూరావు, కందుకూరి విష్ణు వర్ధన్ బాబు, మహమ్మద్ సర్దార్ లు ఇప్పటికే అరెస్టుకాగా, మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. ఈ కేసులో చాకచక్యంగా విచారణ జరిపి నిందితులను పట్టుకున్న సీఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్ కుమార్, సీసీఎస్ సీఐ శివకుమార్ మరియు వారి బృందాన్ని డీఎస్పీ అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్