
*కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీ ఒకరు మృతి
మరొకరికి తీవ్ర గాయాలు*
*మృతుడు కొత్తపల్లి సాయి నగర్ వాసి*
భీమదేవరపల్లి మండల ప్రతినిధి //మన ప్రజావాణి జులై 1
భీమదేవరపల్లి మండలం కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న కారు, బైక్‌ను ఢీకొట్టిన ఈ ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు కొత్తపల్లి గ్రామంలోని సాయినగర్ కాలనీకి చెందిన శ్రీహరి మరియు వెంకటేష్‌లుగా గుర్తించబడ్డారు. సమాచారం మేరకు, ఆళ్ల శ్రీహరి అక్కడికక్కడే మృతి చెందగా, మంచిల్ల వెంకటేష్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న ముల్కనూర్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.