
ఏసీబీకి చిక్కిన గచ్చిబౌలి మహిళ పోలీసు స్టేషన్ ఎస్సై
ఏసీబీకి చిక్కిన గచ్చిబౌలి మహిళ పోలీసు స్టేషన్ ఎస్సై
డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో చోట అవినీతి అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు. అయినా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. మంగళవారం మాదాపూర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కగా.. గురువారం పోలీస్ శాఖకు చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కుటుంబ కలహాలతో అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఓ వ్యక్తి గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్ కు వచ్చాడు. అక్కడ వారి కేసును విచారణ చేస్తున్న ఎస్సై వేణుగోపాల్ బాధితుడి మీద అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేస్తానని, ఎలాంటి కేసు లేకుండా చూసుకుంటానని అందుకు తాను అడిగింది ఇవ్వాలంటూ బేరం కుదుర్చుకున్నాడు.
అందుకు అంగీకరించిన బాధితుడు లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయమై ఏసీబీ అధికారుల ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు. గురువారం గచ్చిబౌలి మహిళా పోలీస్టేషన్ కు చెందిన ఎస్సై వేణుగోపాల్ బాధితుడి వద్ద నుండి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వేణుగోపాల్ ఈ మధ్యనే ప్రమోషన్ లో భాగంగా ఎస్సైగా ప్రమోషన్ పొందినట్లు సమాచారం