
మంత్రి తుమ్మల ఆదేశాలతో "చింత గుర్తి లో 35 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ యార గర్ల హనుమంతరావు.
ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి
రఘునాథపాలెం మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు సిఫారసు మేరకు చింతగుర్తి గ్రామంలో 35 మందికి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఖమ్మం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ప్రజా ప్రభుత్వం ప్రజల జీవితాల్లో వెలుగు నింపిందని అన్నారు. లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి కి ఖమ్మం శాసనసభ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తమ్మినేని నాగేశ్వరావు కొత్త కొమరయ్య సీతారామయ్య మండల అధ్యక్షులు వాంకుడోతు దీప్ల నాయక్ ఆత్మ కమిటీ చైర్మన్ దివిశాల వెంకటేశ్వర్లు తాత రఘురాం ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ కార్యదర్శి హౌసింగ్ ఏఈ చింతగుర్తి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమానికి విజయవంతంచేశారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025